మూడు భాగాలుగా వెండితెరపై 3D రామాయణం

allu-aravind-ready-to-produce-3d-ramayanam-on-silver-screen

వెండితెరపై ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. భారత పురాణ ఇతిహాసమైన రామాయాణాన్ని త్రీడీ రూపంలో తెరకెక్కించనున్నారు నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా లు. ఇప్పటి వరకు రాయాయాణాన్ని కథగా చేసుకొని పలు భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ అవన్నీ రామాయణంలోని ఏదో ఒక ఘట్టాన్ని ముఖ్యంగా తీసుకొని సినిమా తీశారు. ఈ సారి అలా కాకుండా సంపూర్ణ రామాయాణాన్ని మూడు భాగాలుగా తీసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు.

ఈ సిరీస్ కు దంగల్ ఫేమ్ నితీష్ తివారీ, మామ్ ఫేమ్ రవి ఉద్యవార్ లు దర్శకత్వం వహించనున్నారు. మొత్తం మూడు భాగాలుగా రానున్న ఈ సిరీస్ లో మొదటి భాగాన్ని 2021 లో విడుదల చేయనున్నారు. ఈ మేరకు దర్శక నిర్మాతలు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన చేశారు. ప్రైమ్ ఫోకస్ పతాకంపై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోయే ఈ చిత్రం కోసం నటీనటులను వెతికే పనిలో ఉన్నారు.

Latest Updates