క్రేజీ డైరెక్టర్‌‌తో అల్లు అర్జున్ నెక్స్ట్‌ మూవీ

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త మూవీ పుష్ప రెగ్యులర్ షూటింగ్‌ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల నిలిచిపోయింది. తాజాగా బన్నీ మరో కొత్త మూవీ గురించి సడెన్ సర్‌‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, భరత్ అనే నేను లాంటి క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో బన్నీ న్యూ ఫిల్మ్ ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించి ట్విట్టర్‌‌లో బన్నీ ప్రకటన చేశాడు. ఏఏ21 అనే తాత్కాలిక టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2022 ప్రథమార్థంలో విడుదల కానుందని తెలిపారు. ఈ మూవీని యువసుధ ఆర్ట్స్‌పై జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోంది. దీనికి సంబంధించి ఓ గ్రామంలోని నది దగ్గర ఇద్దరు మనుషులు ఉన్న ఫొటోను అల్లు వారి అబ్బాయి పోస్ట్‌ చేశాడు. ఏ కాన్సెప్ట్‌పై సినిమా తెరకెక్కనుందనేది ఈ పోస్టర్‌‌లో క్లారిటీగా తెలియరాలేదు.

‘నా కొత్త సినిమాను ప్రకటించడానికి చాలా ఉత్సుకతో ఉన్నా. నా తదుపరి మూవీగా కొరటాల శివ గారితో ఏఏ21 తీస్తున్నాం. దీని కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాం. ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి తొలి యత్నం నేపథ్యంలో బెస్ట్ విషెస్. కోప్రొడ్యూసర్స్ శాండీ, స్వాతి, నట్టీ మీపై ప్రేమను చూపించడానికి నా మార్గమిదే’ అని బన్నీ ట్వీట్ చేశారు. సినిమాలో నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు వెల్లడించలేదు. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

Latest Updates