మెగాస్టార్‌కు అల్లు అర్జున్ దావత్

సైరా నరసింహారెడ్డి మూవీ సక్సెస్ కావడంతో  మెగాస్టార్ చిరంజీవికి అల్లు అర్జున్ పార్టీ ఇచ్చాడు. అల్లు అర్జున్ ఏర్పాటుచేసిన ఈ బిగ్ పార్టీలో సైరా టీమ్ కూడా సందడి చేసింది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్, సురేందర్ రెడ్డి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నీహారిక, అఖిల్, శ్రీకాంత్, అల్లు శిరీష్, ఫ్రెండ్స్, సన్నిహితులు పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి అంటే తనకెంతో ఇష్టమనీ.. చిన్నప్పటినుంచి ఆయన్ను ఆరాధిస్తూ పెరిగానని అల్లు అర్జున్ ఎప్పుడూ చెబుతుంటాడు. చిరంజీవి వేసిన స్టెప్పులే తనను డాన్సర్ గా మార్చాయని అంటుంటాడు. చిరంజీవి నటించిన డాడీ సినిమాలో డాన్స్ బిట్ తోనే అల్లుఅర్జున్ తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు. చిరంజీవి కెరీర్ లోనే సైరా నరసింహారెడ్డి పెద్ద హిట్ అనిపించుకుంటుండటంతో… అల్లు అర్జున్ ఆయనకు పార్టీ ఇచ్చినట్టు ఫ్యామిలీ వర్గాలు తెలిపాయి.

వరుస సక్సెస్ లతో మెగా ఫ్యామిలీ జోష్ లో ఉంది. చిరంజీవి నటించిన సైరా బ్లాక్ బస్టర్ హిట్ అనిపిస్తోంది. నిర్మాతగా రామ్ చరణ్ తొలి సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. అటు వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్(వాల్మీకి) కూడా హిట్ కావడంతో.. మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తోంది.

Latest Updates