బ్రహ్మానందం గుండె గట్టిది : అల్లు అర్జున్

హాస్యనటుడు బ్రహ్మానందం ఇటీవల ముంబైలో గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకున్నారు. గత నెల 14న ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ లో ఆయనకు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మానందాన్ని అల్లు అర్జున్ కలిసి పరామర్శించారు. మునుపటిలా ఆయన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మరింతగా నవ్వించాలని ఆకాంక్షించారు. ‘ధృఢమైన గుండె గల నిజమైన ఉక్కు మనిషి, నిర్భయుడు, సరదా వ్యక్తి.. కిల్ బిల్ పాండేను చూడటం సంతోషంగా ఉంది’ అంటూ ఆయనతో కలిసి దిగిన ఫొటోను బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఫొటోకు తన మార్క్ స్టైల్ లో పోజిచ్చారు బ్రహ్మానందం. అల్లు అర్జున్ హీరోగా నటించిన చాలా చిత్రాల్లో బ్రహ్మానందం కామెడీ నవ్వులు పంచింది. ముఖ్యంగా ‘రేసుగుర్రం’లో కిల్ బిల్ పాండేగా బ్రహ్మానందం నటన ఆ సినిమాకు హైలైట్ గా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్ లో మరిన్ని చిత్రాలు రావాలంటూ.. బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విష్ చేశారు.

Latest Updates