రివ్యూ: అల..వైకుంఠపురం లో

రన్ టైమ్: 2 గంటల 49 నిమిషాలు

నటీనటులు: అల్లు అర్జున్,పూజా హెగ్డే,సుశాంత్,జయరాం,సముద్రఖని, మురళీ శర్మ,సచిన్ కేద్కర్,టబూ,నివేతా పేతురాజ్,హర్షవర్థన్,సునీల్,రాహుల్ రామకృష్ణ,నవదీప్ తదితరులు

సినిమాటోగ్రఫీ:పి.ఎస్ వినోద్

ఎడిటింగ్: నవీన్ నూలి

నిర్మాతలు: చినబాబు,అల్లు అరవింద్

రచన,దర్శకత్వం: త్రివిక్రమ్

రిలీజ్ డేట్: జనవరి 12,2020

కథేంటి?

ఓ పెద్దింట్లో గుమాస్తా గా పనిచేసే వాల్మీకి (మురళీ శర్మ) స్వార్థంతో తన కొడుకు గొప్పగా బతకాలని ఆ ధనవంతుల అబ్బాయిని (అల్లు అర్జున్) తన కొడుకుగా,తన సొంత కొడుకుని (సుశాంత్) వాళ్ల అబ్బాయిగా తారుమారు చేస్తాడు హాస్పిటల్ లో. పెద్దయిన తర్వాత ఆ ధనవంతుల అబ్బాయి పెద్దగా తెలివితేటలు,ధైర్యం లేకపోవడంతో వాళ్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు.తను తెచ్చుకున్న కొడుకు హైపర్ యాక్టివ్ గా ఉంటాడు.ఆ తర్వాత ఏం జరిగింది.? పెద్దయిన తర్వాత వాళ్లకు నిజం ఎలా తెలిసింది.తద్వారా జరిగిన పరిణామాలు ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:

అల్లు అర్జున్ నటన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చి చెలరేగిపోయాడు.కామెడీ టైమింగ్,ఎమోషనల్ సీన్లు,టీజింగ్ సీన్లలో మెచ్యుర్డ్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు.పూజా హెగ్డే గ్లామర్ ఒలకబోసింది.నటన పరంగా కూడా బాగా చేసింది.టబు నటన ఓకే అనిపిస్తుంది కానీ డబ్బింగ్ అయినా..వేరే వాళ్లతో చెప్పించాల్సింది.తండ్రి పాత్ర చేసిన జయరాం మంచి నటనతో మెప్పించాడు.టబుతో ఓ ఎమోషనల్ సీన్లో బాగా చేశాడు.ఇక మురళీ శర్మ కు ఈ సినిమా తన కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచిపోతుంది..తనకొడుకే బాగుండాలనే సార్థపరుడి రోల్ లో చాలా బాగా నటించాడు.తన గెటప్,హావభావాలు ‘‘ఆహా నా పెళ్లంట’’ లో పిసినారి అయిన కోట శ్రీనివాసరావుని గుర్తుకు తెస్తుంది. సుశాంత్ కు పెద్దగా స్కోప్ ఉన్న పాత్ర లేదు.నివేతా పేతురాజ్ కూడా అంతే.సముద్రఖని రెగ్యులర్ త్రివిక్రమ్ మార్కు విలనిజం పండించాడు.సచిన్ ఖేద్కర్ తన పాత్రలో ఒదిగిపోయాడు.హర్షవర్థన్,రాహుల్ రామకృష్ణ,సునీల్,వెన్నెల కిషోర్,అజయ్ లు బాగా చేశారు.

టెక్నికల్ వర్క్:

పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ నెస్ తీసుకొచ్చింది.ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ టాప్ ఫామ్ లో ఉన్నాడు.పాటలతో ఇప్పటికే నిరూపించుకున్న థమన్..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా తన సత్తా చాటాడు.సినిమా మూడ్ ను ఆ మ్యూజిక్ బాగా క్యారీ చేసింది.నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ బాగుంది.యాక్షన్ ఎపిసోడ్స్ చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు.ఆర్ట్ వర్క్,నిర్మాణ విలువలు బాగున్నాయి.నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా తీసారు.త్రివిక్రమ్ రచయితగా మరోసారి ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
‘‘అల..వైకుంఠపురంలో’’ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.గొప్పసినిమా అనలేం కానీ ఈ మధ్య వచ్చిన త్రివిక్రమ్ సినిమాల్లో ది బెస్ట్..తరచూ ధనికుల కుటుంబాల కథలని చెప్పడానికి ఇష్టపడే త్రివిక్రమ్ మరోసారి అలాంటి స్టోరియే ఎంచుకున్నాడు.ధనిక,మధ్య తరగతి కుటుంబాల మధ్య వ్యత్యాసం,వాళ్ల ఆలోచనలు,జీవితాలను సరిగ్గా ప్రజెంట్ చేశాడు.నిజం చెప్పాలంటే ప్రతీ సీన్ ను బాగా రాసుకున్నాడు. ఆ రాసుకున్నదాన్ని సరిగ్గా ప్రజెంట్ చేశాడు.దానికి నటీనటుల ప్రతిభ,టెక్నీషియన్ల పనితనం బలం చేకూర్చాయి.

చిన్న పాయింట్ మీదే ఈ కథ నడుస్తుంది.అది కూడా రెగ్యులర్ దే అయినా.త్రివిక్రమ్ మార్కు ట్రీట్ మెంట్ వల్ల ఆహ్లాదంగా ఉంటుంది.ఫస్టాఫ్ అంతా సాఫీ గా సాగిపోతుంది.అల్లు అర్జున్,పూజా హెగ్డే ట్రాక్,కామెడీ,యాక్షన్ ఇలా ఎంటర్ టైనింగ్ ఉంటుంది.అయితే ఇంటర్వెల్ కే అసలైన ట్విస్ట్ తెలిసిపోతుంది.చాలా మంది ఇక్కడ సెకండాఫ్ ను ఎలా క్యారీ చేస్తారో అని అనుకోవచ్చు కానీ..ఆ తర్వాత సెకండాఫ్ లో త్రివిక్రమ్ ఎంటర్ టైన్మెంట్ ను ఎక్కువ నమ్ముకున్నాడు.బోర్డ్ మీటింగ్ సీన్,ఆ తర్వాత ‘‘రాములో.. రాముల’’ సాంగ్ మంచి హై తీసుకొస్తాయి.దాని తర్వాతే అసలు సమస్య వచ్చిపడింది.ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ లలో కథనం మందగించినట్టు అనిపిస్తుంది.క్లైమాక్స్ ను తొందరగా కంప్లీట్ చేయకుండా సాగదీసినట్టు అనిపిస్తుంది.ఇలాంటి చిన్న కంప్లయింట్ లు తప్పితే ‘‘అల..వైకుంఠపురంలో’’ సాటిస్ ఫై చేస్తుంది.పండక్కి ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే మూవీ.

allu arjun new movie Ala..Vaikunthampuramlo Review

Latest Updates