ముచ్చటగా మూడోసారి : బన్నీ- త్రివిక్రమ్ మూవీ లాంచ్

అల్లు అర్జున్,  త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో కొత్త సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ ఉమ్మడిగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. హారిక్ అండ్ హాసిని సంస్థలో వస్తున్న ఆరో సినిమా ఇది.

హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19 వ సినిమా. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత…. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ చేస్తున్న 3వ మూవీ ఇది. దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో అల్లు అర్జున్ తో నటించిన పూజా హెగ్డే ఈ మూవీలోనూ జోడీ కడుతోంది.

మూవీ ప్రి-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తికావడంతో.. షూటింగ్ మొదలుపెట్టారు. ఈ నెల 24 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమవుతుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.

మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అల్లు అర్జున్- తమన్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. రేసు గుర్రం, సరైనోడు సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈసారి హ్యాట్రిక్ సక్సెస్ పై కన్నేశారు ఈ ఇద్దరు. త్రివిక్రమ్ – తమన్ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇటీవలే వీరిద్దరి కలయికలో.. అరవింద సమేత సినిమా వచ్చింది.

చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో టబు, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ,రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో ‘సుశాంత్’ నటిస్తున్నాడు.

టెక్నికల్ టీమ్ : నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) , డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటింగ్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ – లక్ష్మణ్

Latest Updates