పాలకొల్లు పవన్ కల్యాణ్ సభలో అల్లు అర్జున్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన మేనమామ పవన్ కల్యాణ్ నిస్వార్థంగా జనానికి సేవ చేయడానికి సిద్ధమయ్యారనీ.. అలాంటి నిజాయితీ పరుడికి ఓటర్లు మద్దతుగా నిలవాలని అల్లు అర్జున్ కోరారు.

పాలకొల్లులో అల్లు అర్జున్… పవన్ కల్యాణ్ తో కలిసి ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు నిర్వహించారు. వేదికపైకి వచ్చిన అల్లు అర్జున్ ను… పవన్ కల్యాణ్ ఆలింగనం చేసుకోవడంతో అభిమానులు ఆనందంతో ఈలవేసి గోల చేశారు. అవినీతి పరులను తరిమికొట్టాలని… నిస్వార్థంగా జనానికి సేవ చేసే నాయకులకు అండగా నిలవాలని ప్రజలను కోరారు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మెగా హీరోలు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్. ఐనప్పటికీ… ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య పోటీ ఉండేది. సినిమా ఫంక్షన్లలో అల్లు అర్జున్ పాల్గొన్న సభల్లో పవన్ కల్యాణ్ అంటూ అరుస్తూ అభిమానులు గోల చేసేవారు. దీంతో.. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో జరిగిన పరిణామాలతో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక్కటయ్యారు. చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ కలిసి కనిపించడంతో… అభిమానులు ఆనందపడ్డారు.

Latest Updates