ఓటరు ప్రశ్న: అప్పుడు ఒక రూల్.. ఇప్పుడు ఒక రూలా?

నిజాంపేటలో ఓటరుకి, పోలింగ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఓటు వేయడానికి వెళ్లిన వ్యక్తిని, పోలింగ్ సిబ్బంది ఐడీ ప్రూఫ్ చూపించాలని కోరారు. దాంతో ఆ వ్యక్తి తన ఫోన్‌లో ఉన్న ఐడీ ప్రూఫ్ చూపించాడు. పోలింగ్ సిబ్బంది ఆ ప్రూఫ్‌ని అంగీకరించలేదు. దాంతో ఓటరు.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సమయంలో ఫోన్‌లో ప్రూఫ్ చూపిస్తే ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు అంగీకరించరు అని సిబ్బందిని ప్రశ్నించాడు. అప్పుడు ఒక రూల్.. ఇప్పుడు ఒక రూలా అని సిబ్బందిని అడిగాడు. మున్సిపల్ ఎన్నికలు.. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల కన్నా పెద్దవా అని ప్రశ్నించాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా కలుగచేసుకొని సదరు ఓటరుని ఐడీ ప్రూఫ్ చూపించాలని లేకపోతే వెళ్లిపోవాలని సూచించారు. దాంతో ఆ ఓటరు అక్కడి నుంచి ఓటు వేయకుండానే వెనుదిరిగాడు.

For More News..

ఇంటర్ బాలుడిపై 11 మంది విద్యార్థుల లైంగిక దాడి

లవర్‌కి వేరే పెళ్లి.. అర్ధరాత్రి ఆమె కుటుంబంపై పెట్రోల్ దాడి..

మార్కెట్‌పై ఉగ్రవాదుల దాడి.. 36 మంది మృతి

Latest Updates