నేను లోకల్​లో ఉంటున్నా…మీరూ ఉండాలె: ఉద్యోగులతో  కొత్తగూడెం డీఎంహెచ్​ఓ

 టైంకు ఆఫీసుకు రావాలి

 వెలుగు స్టోరీకి స్పందన

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఆఫీస్​కు టైం ప్రకారం రాకపోతే చర్యలు తీసుకుంటానని డీఎంహెచ్​ఓ భాస్కర్​ నాయక్​ ఉద్యోగులను హెచ్చరించారు. ‘లోకల్​లో ఉండరు..టైంకు రారు’ అనే హెడ్డింగ్​తో మంగళవారం వెలుగులో పబ్లిష్​ అయిన స్టోరీకి ఆయన స్పందించారు. కొత్తగూడెంలోని డీఎంహెచ్​ఓ ఆఫీస్​లో మంగళవారం ముఖ్యమైన ఆఫీస్​ స్టాఫ్​తో మీటింగ్​ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆఫీస్​లో పనిచేసే వారంతా రూల్స్​పాటించాలన్నారు. అందరూ టైంకు ఆఫీసులో ఉండాలన్నారు. ఉద్యోగులంతా లోకల్​గా ఉండాలని ఆదేశించారు. తాను కొత్తగూడెంలోని విద్యానగర్​లో ఉంటున్నానని తెలిపారు. స్టాఫ్​ పనితీరుపై ప్రతి నెలా సమీక్షించనున్నట్టు స్పష్టం చేశారు.

Latest Updates