పుట్టేటప్పుడు డ్రెస్ తో పుడుతున్నామా? : ‘ఆమె’ ట్రైలర్

amalapaul-aame-trailer-released

పుట్టేటప్పుడు డ్రెస్ తో పుడుతున్నామా.. బట్టలు విప్పితే అదే బర్త్ డే డ్రెస్.

అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘ఆమె’ ట్రైలర్ లో బాగా కనెక్టయ్యే మాట ఇది. ఈ డైలాగ్ ఇపుడు వైరల్ గా మారింది. తమిళంలో ఆడై పేరుతో రూపొందుతున్న ఈ సినిమా.. తెలుగులో ఆమె పేరుతో డబ్ అయి రిలీజ్ కు రెడీ అయింది. మూవీ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది.

ఫ్రెండ్స్ తో పార్టీలు, పబ్ లు, బెట్టింగులు అంటూ విచ్చలవిడిగా తిరిగే అమ్మాయిగా అమలాపాల్ ను చూపించారు. అలాంటి అమ్మాయి… తనకు ఎదురైన ఓ సమస్యను ఎలా ఎదుర్కొంది అనేదే కథ.  బర్త్ డే సెలబ్రేషన్స్ లో బట్టలులేకుండా ఉండటమే అసలైన బర్త్ డే డ్రెస్ అంటూ అమలాపాల్ ట్రైలర్ లో చెబుతుంది. తను చెప్పే ఆ మాటే సినిమా కథకు కీలకం అని చెబుతున్నారు.

మూవీలో అమలాపాల్ నగ్నంగా నటించిన పోస్టర్లు ఇప్పటికే బాగా వైరల్ అయ్యాయి. టీజర్ లో అదే షాట్ ను హైలైట్ చేశారు. ఐతే.. ట్రైలర్ లో మాత్రం ఆ సీన్స్ చూపించలేదు. కానీ.. ఆ సన్నివేశానికి దారితీసిన సందర్భాన్ని చూపించారు.

ట్రైలర్ రిలీజ్ తో మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. ఆమె ఓ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని మేకర్స్ చెబుతున్నారు. కొందరు యువకులపై ఒక యువతి తీర్చుకునే రివేంజ్ స్టోరీ అని చిత్ర అంటున్నారు. మూవీ ఈనెల 19న విడుదల కానుంది.