‘ఆమె’ సాహసానికి సోషల్ మీడియా ఫిదా

అమలాపాల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ తమిళ్ సినిమా ఆడై. ఈ మూవీ తెలుగులోకి ఆమె పేరుతో డబ్ అవుతోంది.ఈ మధ్యే టీజర్ విడుదలైంది. మేకింగ్ టైమ్ లోనే మూవీ స్టిల్స్ ఇండస్ట్రీలో సంచలనం రేపాయి. బోల్డ్ గా.. హింసాత్మకంగా కనిపించే అమలాపాల్ స్టిల్స్ బజ్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గా రిలీజైన టీజర్ కూడా అటు తమిళంలో.. ఇటు తెలుగులో మంచి ప్రశంసలు అందుకుంటోంది.

అమలాపాల్ న్యూడ్ గా కనిపించడమే టీజర్ లో హైలైట్. తమిళ సినీ దర్శక దిగ్గజాలు, నటీనటులు అమలాపాల్ సాహసాన్ని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. ఇది బోల్డ్ నెస్ కాదనీ.. మూవీపై ఆమె చూపించిన డెడికేషన్ ప్రముఖులు, అభిమానులు అన్నారు.

అన్యాయానికి గురైన ఓ ఆడపిల్ల పోరాటమే ఈ కథ. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా మలిచిన ఈ సినిమాలో ఎమోషన్ కంటెంట్ ఎంతో ఎక్కువగా ఉండబోతోందని టీజర్ ను బట్టే అర్థమవుతోంది. టీజర్ లోని సన్నివేశాలు.. మూవీలోని భావోద్వేగాలను ఎక్స్ ప్లెయిన్ చేశాయి. కనిపించకుండా పోయిన తన బిడ్డ ఏమైపోయిందో అని తల్లి పడే ఆవేదన.. ఆమె చివరిసారి తాగిన మత్తులో మాట్లాడిందని చెప్పడం… రక్తపు మడుగులో కనిపించే నిందితుల ముఖాలు… ఎక్కడో బట్టలు లేకుండా పడిపోయిన అమలాపాల్.. తాను ఉన్న పరిస్థితి గమనించి దగ్గరకు కాళ్లు మడుచుకోవడం.. ఇవన్నీ.. మూవీపై అంచనాలను పెంచేశాయి. ఇది.. దేశంలో ఇప్పుడు జరుగుతున్న కిడ్నాప్, లైంగిక దాడి లాంటి నేరాలకు సంబంధించిన కథే అనీ.. అన్యాయాలను ఎదిరించే ఓ సామాన్యురాలి పోరాట కథే అని మేకర్స్ చెబుతున్నారు.

తమిళ సినిమా మయాతా మాన్ అనే మూవీతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రత్నకుమార్.. ఆమె మూవీ తీశాడు. వీ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. త్వరలోనే మూవీని రిలీజ్ చేస్తామని.. రికార్డులు బద్దలుకొట్టే సినిమా అవుతుందని అమలాపాల్ సోషల్ మీడియాలో చెప్పింది.