రెండో పెళ్లి చేసుకున్నఅమలాపాల్! .. ఫోటోలు వైరల్

అమలాపాల్ పరిచయం అక్కర్లేని పేరు. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల్లోనూ నిత్యం వార్తల్లో ఉంటుంది. కెరీర్  ఆరంభంలోనే వరుస హిట్లు ఉన్నప్పుడు డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను 2014 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత  మనస్పర్థలతో 2017లో విజయ్ నుంచి విడాకులు తీసుకుంది. విజయ్ కూడా ఓ డాక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. లేటెస్ట్ గా అమలాపాల్ కూడా రెండో పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే భవిందర్ సింగ్ తో పెళ్లి ఎప్పుడు ,ఎక్కడ జరిగింది అసలు పెళ్లి నిజమా? లేదా ఫేక్ ఫోటోలా? అనేది తెలియాల్సి ఉంది.

 ఆ మధ్యలో ముంబయ్ సింగర్ భవిందర్ సింగ్ తో ప్రేమలో ఉందనే ప్రచారం కూడా జరిగింది. ఇన్ స్ట్రాగ్రమ్ లో భవిందర్ అమలాపాల్ తో ఉన్న ఫోటోలను షేర్ చేయడం తర్వాత డిలీట్ చేయడం కూడా జరిగింది. రెండో పెళ్లి..అది కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటానని గతంలోనే చెప్పిన అమలాపాల్   భవిందర్ సింగ్ ను సైలెంట్ గా పెళ్లి చేసుకుందని సమాచారం. అమలాపాల్ తన భర్తతో లిప్ లాక్ ఫోటోలు, ఉంగరాలు మార్చుకుంటున్నట్లు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest Updates