అమర రాజా కంపెనీ మూసివేతకు ఆదేశం

అమర రాజా కంపెనీ మూసివేతకు ఆదేశం
  • ప్రజల ఆరోగ్యానికి ముప్పని నిర్ధారించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 

అమరావతి: చిత్తూరు జిల్లాలో ఉన్న అమర రాజా బ్యాటరీ కంపెనీల కు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ క్లోజర్ నోటీస్ లు జారీ చేసింది. ఈ కంపెనీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించినవి కావడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో ఉణ్న నూనెగుండ్లపాడు, కరకంబడి గ్రామాల పరిధిలో ఉన్న పరిశ్రమలను మూసివేతకు శనివారం ఆదేశాలు జారీ అయ్యాయి. అమర రాజా కంపెనీల నుండి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిర్ధారించింది. కంపెనీపై ఆరోపణలు రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రక్త నమూనాలు పరిశీలించింది. స్థానిక ప్రజల రక్త సీస విలువలు అధికంగా (బ్లడ్ లీడ్ వాల్యూ) ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. పరిశ్రమ వెదజల్లే కాలుష్యం చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పని నిర్ధారించిన ఎన్ ఆర్ సి ఎల్ పి ఐ పేర్కొంది. పర్యావరణ ఉల్లంఘనలపై కంపెనీల్లో పీసీబీ అధికారులు పలు దఫాలుగా తనిఖీలు నిర్వహించారు. గతంలో షో కాజ్ నోటీస్ లు కూడా జారీ చేశారు. షో కాజ్ నోటీస్ లకు కంపెనీ ఇచ్చిన సమాధానం తో సంతృప్తి చెందని పిసిబి సి ఎఫ్ ఓ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ క్లోజర్ ఆదేశాలు జారీ చేసింది.