అమరావతి రాజధానిపై విచారణ అక్టోబర్ 5 కు వాయిదా

అప్పటి వరకు స్టేటస్ కో యధాతథం

అమరావతి: ఏపీ రాజధానిపై హైకోర్టులో ఉన్న పిటిషన్ల విచారణ అక్టోబర్ 5కు వాయిదా పడింది. ఇప్పటి వరకు ఉన్న స్టేటస్ కో వచ్చే నెల ‌ 5వ తేదీ వరకు పొడిగించింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు రోజు వారీ విచారణ జరగని విషయం తెలిసిందే. అన్ లాక్ 4.0 ప్రారంభమైన నేపధ్యంలో ఈ కేసు విచారణను అక్టోబర్  5 నుంచి రోజువారీ గా చేపడతామని హైకోర్టు ప్రకటించింది. అందుకే విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం రాజధానిపై ఉన్న స్టేటస్‌కో అక్టోబర్‌ 5వరకు యథాతథంగా కొనసాగుతుంది.

Latest Updates