భారీ వర్షాలే కారణం
అమర్నాథ్ యాత్రకు ఆదివారం బ్రేక్ పడింది. వాతావరణం అనుకూలించకపోవడం, భారీ వర్షాలు పడటంతో మూడు బేస్ క్యాంపు నుంచి యాత్రకు వెళ్లాల్సిన భక్తులను ఆపేశారు. హెలికాప్టర్ సర్వీసులను కూడా నిలిపేశారు. శనివారం సాయంత్రానికి కొండపైకి చేరుకున్న భక్తులను మాత్రం దర్శనానికి అనుమతించారు. ఆదివారం ఉదయం 1,000 మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్రను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. అమర్నాథ్ యాత్రను నిలిపేయడం ఇది నాలుగోసారి. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 29 మంది భక్తులు, ఇద్దరు వాలంటీర్లు, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది.. మొత్తం 33 మంది చనిపోయారని అధికారులు చెప్పారు.