అమర్‌నాథ్‌ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

జమ్మూకశ్మీర్‌లో భారీగా కురుస్తున్న వర్షాలు అమర్‌నాథ్ యాత్రకు ఆటంకం కలిగిస్తున్నాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షానికి పెద్ద పెద్ద బండరాళ్లు కూలుతుండడంతో అధికారులు అలర్టయ్యారు. రహదారిని మూసివేశారు. దీంతో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్ హైవేపై కొండచరియలు విరిగిపడుతుండడంతో యాత్రికులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో భగవతినగర్ యాత్రీ నివాస్ నుంచి కశ్మీర్ లోయకు వెళ్లే దారిని పూర్తిగా మూసివేశారు. వాహనాలను కూడా అనుమతించడంలేదు అధికారులు.

Latest Updates