జెఫ్ బెజోస్ అంతరిక్షయానం విజయవంతం

V6 Velugu Posted on Jul 20, 2021

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్షయానం విజయవంతమైంది. నలుగురు సభ్యులతో నింగికి ఎగిసిన న్యూ షెపర్డ్ వ్యోమనౌక విజయవంతంగా రోదసిలో ప్రవేశించింది. అక్కడ కొన్ని నిమిషాలు గడిపిన తర్వాత బెజోస్ టీం స్పేస్ కాప్స్యూల్ సాయంతో సురక్షితంగా భూమికి తిరిగొచ్చింది.

బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ అంతరిక్ష పరిశోధన సంస్థ.. టెక్సాస్ లోని లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రోదసియాత్ర చేపట్టింది. ఈ యాత్రలో బెజోస్ తో పాటు ఆయన సోదరుడు మార్క్ కూడా ఉన్నారు. అంతేకాదు వీరితో పాటు 82 ఏళ్ల మహిళా పైలెట్ వేలీ ఫంక్ కూడా పాల్గొని.. రోదసియాత్ర చేసిన పెద్ద వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు.

న్యూ షెపర్డ్ వ్యోమనౌకను మానవ సహిత రోదసియాత్రలకు అనువైనదా.. కాదా? అని తెలుసుకునేందుకు ఇప్పటివరకు 15 సార్లు పరీక్షించారు. పశ్చిమ టెక్సాస్ ఎడారిలో బెజోస్ తదితరులు ఉన్న స్పేస్ కాప్స్యూల్ పారాచూట్ల సాయంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎడారి ప్రాంతంలో ల్యాండైంది. 

Tagged Amazon chief,  Jeff Bezos, successful spaceflight,  Blue Origin 

Latest Videos

Subscribe Now

More News