అమెజాన్‌లో 50 వేల తాత్కాలిక ఉద్యోగాలు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 50వేల మంది ఉద్యోగుల్ని నియమించుకోనుంది. కరోనా వైరస్ కారణంగా ఆన్ లైన్ వినియోగం బాగా పెరిగినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తరువాత ఆన్ లైన్ సేవలు వినియోగించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సర్వే సంస్థలు చెబుతున్నాయి. అయితే వారి వినియోగం మరింత సులభతరం చేసేందుకు ఈ – కామర్స్ కంపెనీలు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ 50వేల మంది తాత్కాలికంగా ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు ఆ సంస్థ ఇండియా సీఈఓ అఖిల్ సక్సేనా ప్రకటించారు.

కరోనా కారణంగా సోషల్ డిస్టెన్స్ తో సమస్యలు తలెత్తుతున్నాయనే ఉద్దేశంలో వినియోగదారులు ఈ – కామర్స్ కంపెనీల్ని వినియోగించుకుంటున్నట్లు సక్సేనా చెప్పారు.

వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా డెలివరీ రంగంలో అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకొని తమ సర్వీసులను అందిస్తున్నట్లు సీఈఓ అన్నారు.

అంతేకాదు స్విగ్గీ, జుమోటో కు పోటీగా ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టాలనే ప్రయత్నాల్ని అమెజాన్ ప్రారంభించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Latest Updates