అమెజాన్ డెలివరీ బాయ్: హిప్నటైజ్ చేసి అత్యాచారానికి పూనుకున్నాడు..!

అమెజాన్ డెలివరీ బాయ్ ఒకతను  హిప్నటైజ్ చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 43ఏళ్ల మహిళ నోయిడాలో నివసిస్తుంది. కొద్దిరోజుల క్రితం అమెజాన్ లో ఓ బాక్స్ ను ఆర్డర్ చేసింది. అయితే ఓ పెద్ద బాక్స్ లో మరో ఐదు చిన్న బాక్సులు వచ్చాయి. దీంతో ఆ ఐదు చిన్న బాక్సులను రిటర్న్ చేయాలనుకుంది. దీంతో అమెజాన్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది దీంతో అమెజాన్ డెలివరీ బాయ్ బాక్సులను తీసుకెళ్లేందుకు ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. అయితే తాను ఐదు బాక్సులను తీసుకెళ్లనని నాలుగు బాక్సులను మాత్రమే తీసుకెళ్తానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అమెజాన్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి సదరు డెలివరీ బాయ్ మీద ఫిర్యాదు చేసింది ఆమహిళ. అమెజాన్ కంపెనీ ప్రతినిధులు ఆ డెలివరీ బాయ్ ను అక్కడినుంచి తిరిగి ఆఫీస్ కు రావలసిందిగా ఆర్డర్ చేశారు.

బుధవారం రోజు అదే డెలివరీ బాయ్ ఆ మహిళ ఇంటికి వెళ్లి ఐదు బాక్సులను తీసుకెళ్తానని ఆ మహిళకు చెప్పాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు… అమెజాన్ కస్టమర్ కేర్ ప్రతినిధులు తనతో మాట్లాడారని వేరే డెలివరీ బాయ్ ను పంపుతామన్నారని ఆమె తెలిపింది. అతనితో మాట్లాడుతుండగా.. తాను స్పుహ తప్పానని కళ్లు తెరిచి చూసేసరికి ఆ డెలివరీ బాయ్ ప్యాంటు విప్పి తన ముందు నిలబడ్డాడని చెప్పింది. సాయం కోసం అరవగా.. ఎవరూ రాలేరని.. తానే మాబ్ కట్టెతో డెలివరీ బాయ్ పైన దాడి చేశానని దీంతో అతను పారిపోయాడని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై అమెజాన్ ప్రతినిధులు స్పందించారు… కస్టమర్ల భద్రత మాత్రమే తమకు ముఖ్యమని.. సదరు డెలివరీ బాయ్ మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Latest Updates