డోర్ డెలివరీ చేయనున్న అమెజాన్ డ్రోన్ 

amazon-drone-will-be-delivering-the-door

ప్రపంచవ్యాప్తంగా ఆన్​లైన్ అమ్మకాలు సాగిస్తున్న ఈ–కామర్స్ సంస్థ అమెజాన్. పిడకలతో మొదలుకొని కొన్ని వేల రకాల ప్రొడక్ట్స్​ను సేల్ చేస్తోంది. ఇప్పుడు తమ ప్రొడక్టుల డోర్ డెలివరీ విషయంలో ఇకపై అడ్వాన్స్​డ్ టెక్నాలజీని ఫాలో కానున్నట్లు చెప్పింది. స్వతంత్రంగా పని చేసే కొత్త తరం డెలివరీ డ్రోన్లను త్వరలోనే ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ఇటీవల లాస్​వెగాస్​లో జరిగిన ‘రి:మార్స్’ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే అవి కచ్చితంగా ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తాయి? ముందుగా ఎక్కడ డెలివరీ ప్రారంభిస్తాయి? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. డోర్ డెలివరీ డ్రోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో పని చేస్తాయి. తద్వారా టార్గెట్​ను డిటెక్ట్ చేసి సేఫ్​గా వెళ్తాయి. మధ్యలో జనాలను, మేడలపై ఆరేసిన బట్టలను దాటుకుని డోర్ డెలివరీ చేస్తాయి. ఈజీగా టేకాఫ్ అవుతాయి. ల్యాండ్ అవుతాయి. పైకి ఎగిరిన వెంటనే ఏరోప్లేన్ మోడ్​ను అందుకుంటాయి. చుట్టుపక్కల ఉన్న వాటిని గుర్తించేందుకు థర్మల్, డెప్త్ కెమెరాలతోపాటు ‘సోనార్’ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. ‘‘డ్రోన్​డెలివరీ విధానం రాకతో ప్రస్తుతం ఉన్న షిప్పింగ్ ప్రాసెస్ మరింత వేగవంతం కానుంది. ఆర్డర్ చేసిన రోజు, తర్వాతి రోజు డెలివరీ చేసేలా మా సర్వీసులను ఇటీవల విస్తరించాం’’ అని అమెజాన్ వరల్డ్​వైడ్ కన్జూమర్ సీఈవో జెఫ్ విల్కె చెప్పారు. పారాగ్లైడర్లు, పవర్ లైన్లు, ఇళ్లలోని పెంపుడు కుక్కల బారిన పడినా పాడవకుండా డ్రోన్లను కవర్ చేశామని తెలిపారు. ఈ డ్రోన్లు పూర్తిగా ఎలక్ర్టిక్ అని, 15 కిలో మీటర్ల వరకు ఎగరగలవని చెప్పారు. 2.5 కేజీల వరకు బరువున్న ప్యాకేజీలను మోయగలవని తెలిపారు.

Latest Updates