కార్ల కోసం అమెజాన్‌‌ ఎకో ఆటో డివైజ్

ఇకపై కార్లలో కూడా అమెజాన్‌‌ అలెక్సా వాడుకోవచ్చు. కార్స్‌‌ కోసం స్పెషల్‌‌గా ‘ఎకో ఆటో’ అనే డివైజ్‌‌ను రూపొందించింది అమెజాన్‌‌. దీన్ని కార్​లో సెట్‌‌ చేసుకుని, ఎక్కడికైనా తీసుకుని వెళ్లొచ్చు. ఈ డివైజ్‌‌లో స్పీచ్‌‌ రికగ్నిషన్‌‌ టెక్నాలజీతో కూడిన 8–మైక్రోఫోన్‌‌ ఉంది. దీన్ని కార్‌‌‌‌ స్టీరియో సిస్టమ్‌‌తో కనెక్ట్‌‌ చేసుకోవచ్చు. 3.5 ఆక్స్‌‌ కేబుల్‌‌ లేదా బ్లూటూత్‌‌ ద్వారా కనెక్ట్‌‌ చేసుకుని మీడియా ప్లేయర్‌‌‌‌గా వాడుకోవచ్చు. యూజర్లు ఈ డివైజ్‌‌ వాడాలంటే అలెక్సా యాప్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసుకోవాలి. దీని ద్వారా పాటలు ప్లే చేయొచ్చు. మెసేజెస్‌‌ వినొచ్చు. లేదా సెండ్‌‌ చేయొచ్చు.

కాల్స్‌‌ కూడా రిసీవ్‌‌ చేసుకోవచ్చు. యాడ్‌‌ ఫ్రీ మ్యూజిక్‌‌ ఎంజాయ్‌‌ చేయడంతోపాటు ఆర్‌‌‌‌జె టాక్స్‌‌, ఆడియో బుక్స్‌‌ కూడా వినొచ్చు. ఈ డివైజ్‌‌లో ప్రైవసీకి కూడా ప్రాధాన్యం ఇచ్చామని అమెజాన్‌‌ డివైజెస్‌‌ ఇండియా హెడ్‌‌ పరాగ్‌‌ గుప్తా చెప్పారు. ఈ నెల 15 నుంచి అమెజాన్‌‌లో అందుబాటులోకి రానున్న ఈ డివైజ్‌‌ ధర రూ.4,999.

Latest Updates