అమెజాన్‌ ఆటోలొస్తున్నయ్‌…

కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా వస్తువుల డెలివరీకి ఇకపై ఎలక్ట్రిక్‌ ఆటోరిక్షాలను వాడుతామని అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ప్రకటించారు. ఈ-ఆటోరిక్షాలతో రూపొందించిన వీడియోలను, ఫొటోను సోమవారం ట్వీట్‌ చేశారు. దేశవ్యాప్తంగా 20కి పైగా నగరాల్లో ఇవి సేవలు అందిస్తాయి. 2025 వరకు ఇండియావ్యాప్తంగా మొత్తం 10 వేల ఎలక్ట్రిక్‌ డెలివరీ వాహనాలను అందుబాటులోకి తెస్తారు. హైదరాబాద్‌లో కూడా ఈ -ఆటోలు తిరగబోతున్నాయి.

Latest Updates