రికార్డ్ లో నిలిచాడు : ఎంత అంటే అంత ఇచ్చి భార్యను వదిలించుకున్నాడు

భార్యకు విడాకులు ఇవ్వాల్సి వస్తే తన ఆస్తిలోని వాటాను కోర్టు నిర్ణయించిన విధంగా ఇవ్వడం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఏ భర్త ఇవ్వలేని ఆస్తిని ఇచ్చి భార్యను వదిలించుకుంటున్నాడు. అతనే.. ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌.  తన భార్యతో ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.  25ఏళ్ల పాటు జీవనం సాగించిన ఈ జంట ఈ ఏడాది మొదట్లో విడిపోయారు. సంపదలోనే కాదు.. విడాకుల సెటిల్‌మెంట్‌ విషయంలో కూడా బెజోస్‌ రికార్డు సృష్టించబోతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విడాకుల్లో టాప్ ప్లేస్ ఆయనకే దక్కబోతోంది.  విడాకుల భరణం కింద ఆయన తన భార్య మెకంజీకి 38.3బిలియన్‌ డాలర్లు ఇవ్వనున్నట్లు సమాచారం.  తొలుత మెకంజీకి  68 బిలియన్‌ డాలర్లు అందే అవకాశం ఉన్నట్లు వార్తలొచ్చాయి. వాషింగ్టన్‌లోని సీటెల్‌ కోర్టు న్యాయమూర్తి 38.3 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదిర్చినట్లు తెలుస్తోంది.

ఇంత మొత్తం భార్యకు భరణంగా ఇచ్చినప్పటికీ ఇంకా ఈయనే అత్యంత సంపన్నుడిగా నిలుస్తారు.అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ విజయం వెనుక మెకంజీ కీలక పాత్ర పోషించింది. 1992లో న్యూయార్క్‌ నగరంలోని హెడ్జిఫండ్‌ సంస్థ డి.ఈ.షాలో వీరు కలిసి పనిచేశారు. ఈ సంస్థకు జెఫ్‌ ఉపాధ్యక్షుడిగా ఉండగా.. మెకంజీ రీసెర్చి అసోసియేట్‌గా పనిచేశారు. అక్కడ మొదలైన వీరి పరిచయం ఏడాది తర్వాత పెళ్లికి దారి తీసింది. 1993లో వివాహం చేసుకొన్నారు.

Latest Updates