సంక్రాంతి సంబరాల్లో అమెజాన్ సీఈవో

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్. ఢిల్లీలో చిన్నారులతో కలిసి పతంగులు ఎగరవేశారు. మూడు రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చిన ఆయన.. సంప్రదాయ దుస్తులు ధరించి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. చిన్నారులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు జెఫ్ బెజోస్. ఇలా పతంగులు ఎగురవేస్తోంటే చాలా కాలం తర్వాత తనకు బాల్యం గుర్తుకు వచ్చిందని తెలిపారు. తన బాల్యంలో ఇలాగే పతంగులు ఎగరవేశానని అన్నారు. వీధిలో ఉన్న పిల్లలతో కలిసి జెఫ్ బెజోస్ పాల్గొనడం అందరిని ఆకట్టుకుంది.

Latest Updates