అమెజాన్‌, గూగుల్​కు కష్టమే!

న్యూఢిల్లీ: గూగుల్, అమెజాన్ వంటి విదేశీ కంపెనీలకు కొత్త ఈ–కామర్స్ పాలసీ డ్రాఫ్ట్ ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే కంపెనీల డేటాను కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తుంది. మరిన్ని రిస్ట్రిక్షన్‌‌లు అమలవుతాయి. అమెజాన్, గూగుల్ వంటి కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం గత రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. డిపార్ట్‌‌మెంట్ పర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐపీ) డ్రాఫ్ట్ పాలసీ ప్రకారం.. ఇక నుంచి కంపెనీ డేటాను పరిశీలించడానికి ప్రభుత్వం ఈ–కామర్స్ రెగ్యులేటర్‌‌‌‌ను నియమిస్తుంది. డేటా ప్రొటెక్షన్ కోసం సదరు కంపెనీ ‘ఎక్స్‌‌పండబుల్ ఏఐ’ను వాడుతున్నదీ లేనిదీ కూడా చూస్తారు. డేటాను కచ్చితంగా ఇండియాలోనే స్టోర్ చేయాలని ఆదేశించే అవకాశాలూ ఉన్నాయి.ముఖ్యంగా ఈ–కామర్స్ కంపెనీలకు లోకలైజేషన్‌‌ను తప్పనిసరి చేస్తామని సమాచారం. అంతేగాక ఇక నుంచి సెల్లర్లు, కస్టమర్ల ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీ తదితర సమాచారాన్ని కూడా ఇవ్వాలి.

ఇండియా డిజిటల్ ఎకానమీ శరవేగంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. మనదేశంలో ఇప్పటికే 50 కోట్ల మందికి ఇంటర్నెట్ ఉంది. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని స్టడీలు చెబుతున్నాయి. వీరిలో మెజారిటీ యూజర్లు ఆన్‌‌లైన్ షాపింగ్ నుంచి వీడియో స్ట్రీమింగ్ సహా పలు సర్వీసులను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్ల భద్రతకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఇక నుంచి కంపెనీల సోర్సుకోడ్స్‌‌ను, అల్గారిథమ్‌‌లనూ పరిశీలిస్తుంది. దీనివల్ల కంపెనీలు కొంతమంది కస్టమర్ల పట్ల పక్షపాతం చూపకుండా అడ్డుకోవచ్చని డీపీఐఐటీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే, భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ ప్రభుత్వం ఇటీవలే టిక్ టాక్ సహా 59 చైనీస్‌‌ యాప్స్‌‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మనదేశానికి చెందిన కొన్ని స్టార్టప్‌‌లు నిషేధిత కంపెనీల టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. తమకు ప్రత్యామ్నాయాలు చూపాలని ప్రభుత్వాన్ని కోరాయి. వీటికి సాయం చేసే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కొత్త ఈ–కామర్స్ డ్రాఫ్ట్ పాలసీని త్వరలోనే ఆన్‌‌లైన్‌‌లోకి తెచ్చి, సంబంధిత కంపెనీల ఒపీనియన్స్‌‌ను తీసుకుంటామని సంబంధిత ఆఫీసర్ ఒకరు చెప్పారు.

వలస కూలీలకు,ఫ్లయిట్ ,మీల్స్ ఫ్రీ

 

 

 

Latest Updates