అమెజాన్ మరో బంపర్ ఆఫర్ : ఈ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్

పండగ సీజన్ ప్రారంభం కావడంతో అమెజాన్ తన కష్టమర్లకోసం భారీ ఎత్తున ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. ఈనేపథ్యంలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ప్రైమ్ మెంబర్స్‌కు 16 అక్టోబర్ 2020 నుండి మరియు మిగిలిన వారికి అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 23 వరకు నిర్వహించింది. తాజాగా ఆ సేల్స్ ను పొడిగించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ హ్యాపీనెస్ అప్‌గ్రేడ్ డేస్ పేరుతో అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 28 వరకు గాడ్జెట్స్ పై భారీ ఆఫర్లు ప్రకటించింది. దాంతో పాటు ఎక్సేంజ్,ఈఎంఐ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫెస్టివల్ సేల్ లో అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అదనపు ఆఫర్లు వర్తిస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

వాటిలో ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు, సిటీ బ్యాంక్ అనేక ఉత్పత్తులపై 1,500 క్యాష్‌బ్యాక్ ఉండగా, ఐసిఐసిఐ బ్యాంక్ రూ. 1,500 క్యాష్‌బ్యాక్ దాని క్రెడిట్ కార్డులతో మరియు  డెబిట్ కార్డులతో 750 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

అమెజాన్ పే ద్వారా  ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉన్న వినియోగదారులు హ్యాపీనెస్ అప్‌గ్రేడ్ డేస్ అమ్మకం సందర్భంగా వివిధ రకాల ఉత్పత్తులపై 5 శాతం తగ్గింపును పొందవచ్చు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ మరియు మరిన్ని ఉత్పత్తులతో నో-కాస్ట్ మరియు స్టాండర్డ్ ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ హ్యాపీనెస్ అప్‌గ్రేడ్ డేస్ అమ్మకంలో స్మార్ట్ టీవీలపై 65 శాతం తగ్గింపు ఉంటుంది.  పుస్తకాలు మరియు గృహోపకరణాలపై 50 శాతానికి పైగా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్, టాబ్లెట్‌లు మరియు కెమెరాలలో 60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.

 

Latest Updates