అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సెల్ ఫోన్లపై మరోసారీ భారీ ఆఫర్లు ప్రకటించింది. రిపబ్లిక్ డే కు ముందు జనవరి 19 నుంచి 22 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ తో డిస్కౌంట్లు ప్రకటించింది. ల్యాప్‌టాప్,మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఆఫర్ ప్రకటించింది. ప్రత్యేకంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తో ఫోన్లు కొన్న వారికి 10 శాతం డిస్కౌంట్  ఇస్తుంది. ఈ గ్రేట్ ఇండియన్ సేల్‌లో అమెజాన్ 40 శాతం వరకు తగ్గింపుతో మొబైల్ ఫోన్‌లను అమ్ముతుంది.

అంతేగాకుండా అమెజాన్ ఫ్యాషన్ విభాగంలో  80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో బట్టలు, చెప్పులు, గడియారాలు  బ్యాగ్స్-సామాన్లపై ఈ డిస్కౌంట్ ప్రకటించింది. టీవీలతో పాటు రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లు, ఎయిర్ కండిషనర్లు పై  40 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.  క్రెడిట్ కార్డ్ తో పాటు డెబిట్ కార్డ్ ,బజాజ్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పించింది అమెజాన్ .

Latest Updates