అమెజాన్ ఆఫర్ సేల్ వచ్చేస్తోంది!.. మొబైల్స్‌పై 40% డిస్కౌంట్

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మళ్లీ అదిరిపోయే ఆఫర్స్‌తో వచ్చేస్తోంది. మరో పది రోజుల్లో సూపర్ డిస్కౌంట్స్‌తో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ మన ముందుకు తెస్తోంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు మొదలు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, కిచెన్ సహా ఇంటిలో ఉపయోగపడే అన్ని రకాల ఎలక్ట్రానిక్, ఇతర అప్లియన్సెస్‌పై భారీగా తగ్గింపు ధరలను అందించబోతోంది. పలు మొబైల్ బ్రాండ్స్‌పై 40 శాతం వరకు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువలుపై 60 శాతం వరకు డిస్కౌంట్ రేట్లు పెట్టబోతున్నామని అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎప్పటి నుంచి…

ఈ నెల 19 నుంచి 22 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సాగుతుంది. అదే అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఒక్కింత ముందుగానే ఆఫర్ల బొనాంజా స్టార్ట్ అవుతుంది. 2020 జనవరి 18 మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రైమ్ కస్టమర్లు డిస్కౌంట్ సేల్‌లో వారికి నచ్చినవి ఆర్డర్ చేసేయొచ్చు.

ఏ బ్యాంకు కస్టమర్లకు ఏ ఆఫర్లు

అమెజాన్ ఈ గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు కస్టమర్లకు ప్రత్యేకంగా మరో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, పలు బ్యాంకుల డెబిట్ కార్డులపై కూడా నో కాస్ట్ ఈఎంఐ సదుపాకం కల్పిస్తోంది. వన్ ప్లస్, శాంసంగ్, షియోమీ, యాపిల్, వివో, ఒప్పో, నోకియా, హానర్, హువాయ్ సహా పలు బ్రాండ్స్ ఫోన్లపై మంచి ఆఫర్లతో సేల్ పెట్టబోతున్నట్లు అమెజాన్ తెలిపింది. వీటిపై ఎక్సేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయని తెలిపింది.

సొంత బ్రాండ్‌లో 45 శాతం ఆఫర్లు

అమెజాన్ తన సొంత బ్రాండ్లపై 45 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎకో రేంజ్, ఫైర్ టీవీ స్టిక్, కిండిల్ ఈరీడర్స్ వంటి వాటిపై ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పింది. అలాగే ఎకో ఇన్‌పుట్ స్మార్ట్ స్పీకర్స్, ఒనిడా ఫైర్‌టీవీ ఎడిషన్ స్మార్ట్ టీవీలపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని తెలిపింది.

Latest Updates