హైదరాబాద్‌‌లో అమెజాన్ 2 డేటా సెంటర్లు

ఇండియా డేటా బిజినెస్‌ 2024
నాటికి 4 బిలియన్‌‌ డాలర్లకు
చేరుతుందని అంచనా

వెలుగు : ఆన్‌‌లైన్‌‌ బిజినెస్‌‌ కంపెనీ అమెజాన్‌‌ రూ. 11,416 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌ లో రెండు డేటా సెంటర్లు పెట్టనుంది. సిటీ శివార్లలో రంగారెడ్ డి జిల్లాలలోని రెండు ప్రాంతాలలో ఈ రెండు డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నా యి. డేటా సెంటర్ల ఏర్పాటుకు ఎన్విరాన్‌‌మెంటల్‌‌ క్లియరెన్స్‌‌ కోసం అమెజాన్‌‌ అప్లై చేసుకుంది. పెట్టుబడిలో 90 శాతం హైడ్‌‌ కంప్యూటర్లు, స్టోరేజ్‌‌ ఎక్విప్‌ మెంట్‌ ల కోసం వెచ్చించనున్నారు. తెలంగాణ ప్రాంతంలో అమెజాన్‌‌ వెబ్‌ సర్వీసెస్‌‌ విస్తరణకు ఈ డేటా సెంటర్లు సాయపడతాయని భావిస్తున్నారు. శంషాబాద్‌ మండలంలోని చందనవెల్లి వద్ద ఒకటి, కందుకూర్‌‌ మండలంలోని మీర్‌‌ఖాన్‌‌పేట వద్ద మరొకటి డేటా సెంటర్లను అమెజాన్‌‌ ప్రతిపాదిస్తోంది. హైదరాబాద్‌ ఫార్మా సిటీ ప్రాజెక్టు కోసం సేకరించి న స్థలంలోనే ఒక డేటా సెంటర్‌‌ను అమెజాన్‌‌ నెలకొల్పాలనుకుంటోం ది. అమెజాన్‌‌ డేటా సర్వీసెస్‌‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌‌ (ఏడీఎస్‌‌ఐపీఎల్‌‌)కు ఎన్విరాన్‌‌మెంటల్‌‌ క్లియరెన్స్‌‌ ఇవ్వమని స్టేట్‌ ఎక్స్‌‌పర్ట్‌‌ ఎప్రైజల్‌‌ కమిటీ (ఎస్‌‌ఈఏసీ) రికమెండ్‌‌ చేసింది కూడా.

చందనవెల్లి వద్ద డేటా సెంటర్‌‌ను 66,003 చదరపు మీటర్లు, మీర్‌‌ఖాన్‌‌పేట వద్ద డేటా సెంటర్‌‌ను 82,833 చదరపు మీటర్లలోనూ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు అమెజాన్‌‌ చెబుతోంది. 20 వేల చదరపు మీటర్లకు మించే ప్రతి నిర్మాణ ప్రాజెక్టుకూ 2006 నాటి ఎన్విరాన్‌‌మెంట్‌ ఇంపాక్ట్‌‌ ఎసెస్‌‌మెంట్‌ నోటిఫికేషన్‌‌ ప్రకారం ఎన్విరాన్‌‌మెంటల్‌‌ క్లియరెన్స్‌‌ తప్పనిసరి. పై రెం డు ప్రాంతాలతోపాటు, రావిర్యాల (మహేశ్వరం మండలం) వద్ద కూడా అమెజాన్‌‌కు స్థలం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఇండస్ట్రియల్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌‌ (టీఎస్‌‌ఐఐసీ)కి ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ డిపార్ట్‌‌మెంట్‌ లెటర్‌‌ రాసింది.

క్లౌడ్‌ , బిగ్‌ డేటాతో డేటా బిజినెస్‌ బూమ్‌ ….

ఇండియాలోని డేటా సెంటర్‌‌ మార్కెట్‌ 2024 నాటికి 4 బిలియన్‌‌ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యం లో మార్కెట్లో మంచి వాటా దక్కిం చుకోవాలని అమెజాన్‌‌ టార్గెట్‌ గా పెట్టుకుం ది. క్లౌడ్‌‌ కంప్యూటింగ్‌ , బిగ్‌ డేటా, ఐఓటీ సర్వీసెస్‌‌లు ఇండియాలో పెరుగుతుండటంతో డేటా సెంటర్లకూ డిమాండ్‌‌ పెరుగుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇంటర్‌‌నె ట్‌ , స్మార్ట్‌‌ డివైసెస్‌‌ల వినియోగం కూడా ఇండియాలో బాగా ఎక్కువవుతోంది. వీటికితోడు కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సేవలను డిజిటల్‌‌ ప్లాట్‌ ఫామ్స్‌‌కు మైగ్రేట్‌ చేయాలని చూస్తున్నాయి. డేటా సెంటర్‌‌ బిజినెస్‌‌కు ఇవన్నీ మంచి అవకాశాలు కల్పించేవే.

see also: బీచ్ లో యువకుడు గల్లంతు

టెన్త్​ నుంచే ఆన్​జాబ్​ ట్రైనింగ్​

కాగ్నిజెంట్‌ లో 20వేల మందికి జాబ్స్

 

 

Latest Updates