అమెజాన్‌‌లో బస్‌‌టిక్కెట్ బుకింగ్

బెంగళూరు : అమెజాన్ ఇండియా ప్రైవేట్ బస్ టిక్కెట్ బుకింగ్ సర్వీసులను లాంచ్ చేసింది. దీని కోసం రెడ్‌‌బస్‌‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా అమెజాన్ కస్టమర్లకు రెడ్‌‌బస్‌‌లోని ఫీచర్లు అన్నీ అందుబాటులో ఉంటాయి. బస్ సర్వీసు రేటింగ్స్, బస్ లైవ్ ట్రాకింగ్, బస్ నెంబర్, బస్ బయలుదేరే ముందు కాంటాక్ట్ ఇన్‌‌ఫర్మేషన్ వంటి ఫీచర్లన్నీ అమెజాన్ కస్టమర్లకు తెలుస్తాయి. అమెజాన్ పే ట్యాబ్ కింద బస్ టిక్కెట్ల కేటగిరీలో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే, పాలసీ ప్రకారం క్యాన్సిలేషన్ పెనాల్టీ ఉంటుంది. ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని కంపెనీ చెప్పింది.

Latest Updates