మెడిసిన్స్ నేరుగా ఇంటికే.. అమెజాన్ ఫార్మసీ సేవలు షురూ

వాషింగ్టన్: ప్రముఖ ఆన్‌‌లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ కొత్త సర్వీసులను ప్రారంభిస్తోంది. అమెజాన్ ఫార్మసీ పేరుతో ఇకపై మెడిసిన్స్‌‌ను హోం డెలివరీ చేయనుంది. అయితే ఈ ఆర్డర్‌‌లకు మొదట ప్రిస్క్రిప్షన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే తమకు ఏదైనా మందులతో అలర్జీ లాంటి సమస్యలు ఏర్పడితే వాటినీ పేర్కొనాలి. డాక్టర్లు మాత్రం ప్రిస్క్రిప్షన్స్‌‌ను అమెజాన్ ఫార్మసీకి నేరుగా పంపొచ్చు. అమెరికాలోని 45 రాష్ట్రాల్లో అమెజాన్ ఫార్మసీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇండియాతోపాటు ఇతర దేశాల్లో ఈ సేవలను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే దానిపై ఎలాంటి ప్రకటన రాలేదు.

పేషెంట్లు ప్రిస్క్రిప్షన్స్‌‌ను రీటెయిలర్స్ నుంచి కూడా ట్రాన్స్‌‌ఫర్ చేయొచ్చు. ఈ మందుల మీద అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌‌కు ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రైమ్ మెంబర్స్‌‌కు మందులు ఆర్డర్ చేసిన రెండ్రోజుల్లోనే డెలివరీ అందుతాయి. ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా మెడిసిన్స్‌‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఉంటే పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ప్లాన్‌‌తో పేమెంట్ చేసుకోవచ్చు.

Latest Updates