వెబ్ ​సిరీస్​లో అమితాబ్?

వెండితెరపై మెగాస్టార్​గా ఉన్న అమితాబ్​ బచ్చన్​ బుల్లితెరపై కూడా ‘కౌన్​బనేగా కరోడ్​పతి’ ద్వారా సత్తా చాటుతున్నారు. ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ తనకు సరైన అవకాశం దొరికితే డిజిటల్​ ప్లాట్​ఫామ్​పై కూడా అడుగుపెడతానని చెప్పాడు. ‘ప్రస్తుతం డిజిటల్​ ప్లాట్​ఫామ్స్ (నెట్​ఫ్లిక్స్, అమెజాన్, జీఫైవ్)పై మంచి కంటెంట్​తో కూడిన సినిమాలొస్తున్నాయి. మంచి కంటెంట్​తో ఎవరైనా వస్తే వెబ్​సిరీస్​లలో కూడా నటించేందుకు సిద్ధం’ అని బిగ్​బి చెప్పాడు. దీంతో తాము అమితాబ్ తో వెబ్​సిరీస్​ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని అమెజాన్​  ప్రకటించింది. దేశంలోని టాప్​ ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో ఒకటిగా కొనసాగుతున్న అమెజాన్​ అనేక వెబ్​సిరీస్​లతో ఆకట్టుకుంటోంది. త్వరలో అమితాబ్​తో కూడా సిరీస్​ రూపొందించేందుకు కథ సిద్ధం చేస్తోంది. అమితాబ్​ కొడుకు అభిషేక్​ బచ్చన్​ ఇప్పటికే వెబ్​సిరీస్​లో నటిస్తున్నాడు. ఆయన ‘బ్రీత్–2’లో నటిస్తున్నాడు.

 

 

Latest Updates