ఈ నెల 27న అంబేద్కర్ మహాగర్జన : MRPS

ఈ నెల 27న అంబేద్కర్ వాదుల మహా గర్జన నిర్వహిస్తున్నట్లు MRPS జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించినందుకు సీఎం కేసీఆర్ మూల్యం చెల్లించుకోకతప్పదని అన్నారు. యావత్ ప్రపంచం అంబేద్కర్ ను ప్రపంచ మేధావిగా గుర్తిస్తుంటే కేసీఆర్ ఓర్చుకోవడం లేదని అన్నారు. SC,ST,BC నాయకులంటే కేసీఆర్ కు చిన్న చూపు అని అన్నారు. TRS పార్టీ పెట్టినప్పటి నుండి అంబెేద్కర్, పూలే, జగ్ జీవన్ రావు, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహనీయుల విగ్రహాలకు కనీసం ఒక్క పూల మాల వేయలేదని అన్నారు మంద కృష్ణ.

హౌజ్ అరెస్ట్ లో ఉన్న మందకృష్ణను.. పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు కలుస్తున్నారు. ఈ సందర్భంగా తమ కార్యాచరణను ఆయన ప్రకటించారు.

అంబేద్కర్ లోనే మా భవిష్యత్తును చూసుకునే మేము ఆయన విగ్రహానికి జరిగిన అవమానంతో చాలా బాధపడుతున్నామని  అన్నారు మంద కృష్ణ మాదిగ. ఇందుకు కేసీఆర్ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వాదులను ఏకతాటిపై తెచ్చేందుకు 27న మహా గర్జనను నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలోని ప్రతీ బస్తీ నిరసన సభలను ఏర్పాటు చేసుకొవాలని MRPS పిలుపు నిచ్చింది.

మహాగర్జన కోసం ప్రకాశ్ అంబేద్కర్ కు ఆహ్వానం

ఈనెల 17న ఇందిరాపార్క్ దగ్గర నిరసన తెలిపేందుకు MRPS ప్రయత్నించింది. ఐతే.. పోలీసులు అనుమతి లేదంటూ మందకృష్ణను హౌజ్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును తప్పుపట్టిన మందకృష్ణ మాదిగ…. ఈ నెల 22వరకు అంబేద్కర్ విగ్రహాల ఎదుట నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. MRPS పిలుపుతో ఈ నిరసనలు 22 వరకు యధాప్రకారం కొనసాగుతాయని.. చివరి అంకంలో ఈనెల 27వ తేదీన హైదరాబాద్ లో మహా గర్జన నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ మహా సభకు.. అంబేద్కర్ మనమడు ప్రకాష్ అంబెడ్కర్, జిగ్నేష్ మేవాని, ఖర్గే,  మీరాకుమార్,  బీమ్ ఆర్మీ నేత చంద్ర శేఖర్ ఆజాద్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని తెలిపారు.

SC,ST,BCలంటే KCRకు పట్టింపులేదు : జాజుల

అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం దారుణమనీ.. sc, st, bc నాయకులు అంటే కేసీఆర్ పట్టింపులేదని విమర్శించారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. గాంధేయ మార్గంలో ఉద్యమం చేస్తామనీ.. KTR రోడ్ షో లు చేస్తే రాని ఇబ్బంది.. మేము విగ్రహాల ముందు నిరసన తెలిపితే వస్తుందా అని ఆయన ప్రశ్నించారు.

మంద కృష్ణ మాదిగ గృహనిర్భందం ఓ పైశాచిక చర్య: దత్తాత్రేయ
మంద కృష్ణ మాదిగను గృహనిర్బంధం చేయడం ఓ పైశాచిక చర్య అని అన్నారు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ. పంజాగుట్ట వద్ద అంబేద్కర్ విగ్రహ తొలగింపును నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద నిరసనను వ్యక్తం చేశారు దత్తాత్రేయ.

Latest Updates