అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి

ఈ నెల13న హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ వాదులు ఏర్పాటు చేసిన విగ్రహం జీహెచ్ఎంసీ అధికారులు తొలగించిన స్థానంలో ప్రభుత్వం వెంటనే కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి. విగ్రహం తొలగించిన అధికారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్ చౌరస్తాలో జాతీయ మాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేర బాలకిషన్ నేతృత్వం లో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. రోడ్డుపై నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరా బాల కిషన్ మాట్లాడుతూ ప్రభుత్వం భేషజాలకు పోకుండా, విగ్రహం తొలగించిన స్థానంలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం తొలగించడంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ప్రధాన పాత్ర వహించాడని ఆయన్నివిధుల నుంచి తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు, జేఎంఐవీ నాయకులు కృష్ణ ప్రకాష్, మనోజ్ కుమార్, పి శ్రీశైలం, రాఘవేందర్, మల్లేష్ ,భిక్షపతి, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Latest Updates