హైకోర్టు గ్రీన్ సిగ్నల్: మే8న అంబేద్కర్ వాదుల మహాగర్జన

MRPS తలపెట్టిన ‘అంబేద్కర్ వాదుల మహా గర్జన’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మే8న సభ జరుగనున్నట్లు తెలిపారు MRPS చీఫ్ మంద కృష్ణ మాదిగ. ఎప్రిల్ 14న పంజగుట్ట సర్కిల్ లో అంబేద్కర్ విగ్రహ తొలగింపు.. వివాదం కావడంతో 17వతారీకున నిరసన కార్యక్రమాలను చెపట్టడానికి రెడీ అయ్యారు మందకృష్ణ… దీంతో పోలీసులు వారిని నిర్భందించారు. ఇందులో భాగంగా ఎప్రిల్ 27న హైదరాబాద్ లో అంబేద్కర్ వాదుల మహా గర్జనను నిర్వహిస్తామని ప్రకటించారు మందకృష్ణ. ఇందుకు ప్రభుత్వం అనుమతులను ఇవ్వలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా ఈ రోజు తీర్పును ఇచ్చిన హైకోర్టు మే8న సభను నిర్వహించుకునేందుకు అనుమతులను ఇచ్చింది.

Latest Updates