రోడ్డుపై కొండచరియలు..చిక్కుకున్న అంబులెన్స్

ambulance-carrying-a-pregnant-woman-got-stuck-in-landslides

ఉత్తరాఖండ్‌ లో కొండ చరియలు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం గర్భిణీని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ కొండచరియల్లో చిక్కుకుంది. అంబులెన్స్‌ వెళ్తున్న మడ్‌ కోట్‌-మున్స్‌యారి మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో..ఆ వాహనం మధ్యలో చిక్కుకుపోయింది.

విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని ఆ మార్గంలో పేరుకుపోయిన కొండచరియలను తొలగించారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఉన్న గర్భిణీని సేఫ్ గా హస్పిటల్ కి తరలించారు.

Latest Updates