రోడ్డు మధ్యలో మంత్రి ప్రోగ్రాం.. దారి మళ్లిన అంబులెన్స్

వెల్గటూర్, వెలుగు: మంత్రి ప్రోగ్రాం సందర్భంగా రోడ్డును పూర్తిగా బ్లాక్​చేస్తూ స్టేజీ వేయడంతో అత్యవసరంగా వెళుతున్న అంబులెన్సును దారి మళ్లించాల్సి వచ్చింది.  వెల్గటూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్  రావడంతో జగిత్యాలకు వెళ్లే రోడ్డుపై టీఆర్ఎస్ నేతలు స్టేజ్ వేసి కార్యక్రమం నిర్వహించారు. ఆ టైంలో అటుగా అంబులెన్స్​వచ్చింది. రోడ్డు పూర్తిగా బ్లాక్​ చేసి ఉండడంతో అంబులెన్స్ వేరే రూట్లో వెళ్లింది. ఓ పక్క వెల్గటూర్ మండల కేంద్రంలో కరోనా విజృంభిస్తున్న టైంలో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి రోడ్డుకు అడ్డంగా స్టేజ్ వేయడంపై గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

For More News..

రెండున్నరేళ్ల కిందటి ‘రైతుబంధు’ ఇప్పుడిచ్చిన్రు

పనికిమాలిన చట్టాన్ని మార్చాలె: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

మూడెకరాల స్కీమ్‌‌కు ఫుల్ స్టాప్​ పెట్టిన కేసీఆర్

Latest Updates