ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన అంబులెన్స్‌

ఢిల్లీలో ఆగి ఉన్న ట్రక్కును అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా..నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారు జామూన 4.30 గంటల ప్రాంతంలో గర్భిణి మహిళను నోయిడా ఆసుపత్రి నుంచి సఫ్దర్‌ఫ్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ మయూర్‌ విహార్‌ పోలీస్‌స్టేషన్‌ దగ్గర ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో సౌరభ్‌(2), నర్సింగ్‌ సిబ్బంది సునీల్‌ కుమార్‌(35) చనిపోయారు. ప్రమాదంలో  గాయపడిన మనూ(35), ఆమె భర్త సురేశ్‌(25), వారి కూతురు(4), అంబులెన్స్‌ డ్రైవర్‌ విపిన్‌కుమార్‌(25)లను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు పోలీసులు. అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం, ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates