మళ్లీ టీవీ తెరపైకి ఆమిర్ ఖాన్

బాలీవుడ్ ‘సూపర్ స్టా ర్’ఆమిర్ ఖాన్ మళ్లీబుల్లి తెరపై కనిపించనున్నారు.గతంలో సామాజిక అంశాలపై స్పందిస్తూ‘సత్యమేవ జయతే’ వంటిటీవీ షో చేసిన ఆమిర్ చాలా ఏళ్ల తర్వాత తిరిగిటీవీ షోతో వస్తున్నాడు.అది కూడా భార్య కిరణ్ రావుతో కలిసి. ఈ సారికూడా ఆమిర్‌ సోషల్ ఇష్యూతో కూడిన షోతోనే రానుండటం విశేషం.

‘సత్యమేవజయతే’.. దేశంలోని సామాజిక సమస్యల్ని ఎత్తి చూపే టీవీ షో. 2012నుంచి కొంత కాలం పాటు స్టార్ ప్లస్ తో పాటు వివిధ చానళ్లలో ప్రసారమైన ఈషో దేశవ్యా ప్తంగా ఎందరినో ఆకట్టుకుంది.రెగ్యులర్ ఎంటర్ టైన్ మెంట్ షోలకు భిన్నంగా, సామాజిక అంశాలపై అవగాహన, చర్చ, పరిష్కార వేదికగా నిలించింది ఈ షో. సాధారణ టీవీ ప్రేక్షకులతో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు,సామాజిక ఉద్యమకారుల్ని కూడా ఈ షో కదిలించింది. దీనికి రూపకర్త, నిర్మాత ఆమిర్ ఖాన్. ఆయనే ఈ షోకు వ్యాఖ్యాతగావ్యవహరించారు. హిందీతో పాటు పలుప్రాంతీయ భాషల్లోనూ అనువాదమైంది.25 ఎపిసోడ్ల వరకు సాగిన ఈ షో అప్పట్లోఓ సంచలనం. ఇది ఆమిర్ ఖాన్ కు మంచిగుర్తింపు తీసుకొచ్చింది.

వివాదాల వల్ల

అయితే 2014, ఆ తర్వాతి కాలంలో‘సత్యమేవ జయతే’ నిర్మాత ఆమిర్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యల ఫలితంగా ఆయనపై విమర్శలు చెలరేగాయి. వీటి ప్రభావం షో పైపడింది. ఈ వివాదాల నేపథ్యంలో షోను కొనసాగించలేక ఆపేశారు. దీంతో అప్పటినుంచి బుల్లితెరపై ఆమిర్‌ ఖాన్ సొంతంగాషో చేయలేదు. వేరే టీవీ షోలలో మాత్రంకనిపించారు.

‘తూఫాన్ ఆలయ’తో

నాలుగైదేళ్ల విరామం తర్వాత అమీర్ ఖాన్ మళ్లీ కొత్త టీవీ షో మొదలుపెట్టాడు. దీనిపేరు ‘తూఫాన్ ఆలయ’. ఇది జల వనరుల సంరక్షణ, వినియోగం నేపథ్యంలో సాగే షో.మహారాష్ట్రలో ఉన్న కరువు సమస్యను ఎదుర్కొనే నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటివనరుల్ని ఎలా సంరంక్షించుకోవాలి అనేఅంశం ప్రధానంగా సాగుతుంది. మూడేళ్లక్రితం ‘పాని ఫౌండేషన్’ను ఆమిర్ భార్య కిరణ్ రావు, సత్యమేవ జయతే టీమ్ తోకలిసి స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోమహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో నీటిని సంరక్షించే చర్యలు చేపడుతున్నా రు. కరువును ఎదుర్కొనేందుకు ఉన్న నీటి వనరుల్ని ఎలావాడుకోవాలి, వర్షపు నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ఇందుకు అవసరమైన నిర్మాణం, ఆర్థిక సహాయంవంటివి చేస్తున్నారు. తమ ఫౌండేషన్ చేపట్టిన పనులు గ్రామాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయనే అంశాల్ని ఈ షో ద్వారావివరిస్తారు.

భార్యతో కలిసి

‘తూఫాన్ ఆలయ’కు ఉన్న మరో ప్రత్యేకత ఆమిర్ ఖాన్ తోపాటు ఆయన భార్య కిరణ్ రావు కూడా ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటం. ఇద్దరూ కలిసి ఈ షోను నడిపిస్తున్నా రు.‘జీ మహారాష్ట్ర’చానల్లో గత శనివారం తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. దీనికి సంబంధించిన యూట్యూబ్ ఏ వీడియో లింక్ ను ఆమిర్ సోషల్ మీడియాలో  షేర్ చేశారు.

Latest Updates