కరోనావైరస్ ఫస్ట్ సెల్ఫ్ టెస్ట్ కిట్.. 30 నిమిషాల్లోనే రిజల్ట్

కేవలం 30 నిమిషాల్లోనే రిజల్ట్ ఇచ్చే కరోనా సెల్ఫ్ కిట్‌ను అమెరికా అమోదించింది. ఈ కిట్‌ను ఉపయోగించి ఇంట్లో టెస్ట్ చేసుకొని.. 30 నిమిషాల్లో ఫలితాలను తెలుసుకోవచ్చని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం తెలిపింది. లూసిరా హెల్త్ చేత తయారు చేయబడిన ఈ సింగిల్-యూజ్ టెస్ట్ కిట్ ద్వారా 14 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారిలో టెస్ట్ చేయవచ్చు. దీని ద్వారా ముక్కులోని నమూనాలు తీసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారికి ఈ పరీక్షలు హెల్త్ కేర్ ప్రొవైడర్ సమక్షంలోనే నమూనాలను తీసుకోవాలని ఆరోగ్య నియంత్రణ సంస్థ తెలిపింది.

‘ఇంట్లోనే ఉండి కరోనావైరస్ పరీక్షలు చేసుకోవడం ద్వారా ఫలితాలను అందించే మొదటి సెల్ఫ్ కిట్ ఇది’ అని FDA కమిషనర్ స్టీఫెన్ హాన్ తెలిపారు. ఈ కిట్‌లను ఆస్పత్రులలో కూడా ఉపయోగించవచ్చని ఆయన అన్నారు.

For More News..

బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని విమాన సిబ్బందిని కొట్టిన ఎస్సై

యాక్టర్ ఖుష్బూ కారును ఢీకొన్న ట్యాంకర్.. కారులోనే ఖుష్బూ

క్లోజ్ ఫ్రెండ్‌తో గొడవలా.. అయితే ఇలా చేయండి

Latest Updates