ఒక్కో వ్యక్తికి రూ.91 వేల ఆర్థికసాయం ప్రకటించిన అమెరికా

బెడ్లు సాల్తలేవు

వెంటిలేటర్లకూ షార్టేజీనే
రోజూ వేలల్లో కరోనా కేసులు
ఆస్పత్రులకు పేషెంట్ల క్యూ
పాత హాస్పిటళ్లు ఓపెన్‌ చేస్తున్నరు
కొత్తవీ ఫాస్ట్‌‌‌‌గా రెడీ చేస్తున్నరు

అమెరికాలో కరోనా వైరస్‌‌‌‌విలయతాండవం చేస్తోంది. పేషెంట్ల సంఖ్య రోజుకు 10 వేలకు పైనే పెరుగుతోంది. దీంతో అక్కడ పేషెంట్లకు బెడ్లు సరిపోని పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూసేసిన పాత హాస్పిటళ్లను మళ్లీ ఓపెన్‌‌‌‌చేస్తున్నారు. సింగిల్‌‌‌‌రూమ్‌‌‌‌లను డబుల్‌‌‌‌చేస్తున్నారు. అందుబాటులోని బిల్డింగులను త్వరత్వరగా హాస్పిటళ్లుగా మారుస్తున్నారు. ఇల్లినాయిస్‌‌‌‌లో సెప్టెంబర్‌‌‌‌లో మూసేసిన 314 పడకల బెడ్‌‌‌‌ను మళ్లీ ఓపెన్‌‌‌‌చేశారు. న్యూయార్క్‌‌‌‌లో సిటీ కన్వెన్షన్‌‌‌‌సెంటర్‌‌‌‌నే తాత్కాలిక హాస్పిటల్‌‌‌‌గా మార్చారు. యూఎస్‌‌‌‌నేవీకి చెందిన ఫ్లోటింగ్‌‌‌‌హాస్పిటళ్లు ఇప్పటికే లాస్‌‌‌‌ఏంజెలెస్‌‌‌‌, న్యూయార్క్‌‌‌‌వైపు ప్రయాణం మొదలుపెట్టాయి.

యూఎస్‌‌‌‌లో ఒక్కొక్కరికి రూ. 91 వేలు

కరోనా వైరస్‌‌‌‌రెస్క్యూ ప్యాకేజీని ఎట్టకేలకు అమెరికా సెనెట్‌‌‌‌ఏకగ్రీవంగా ఆమోదించింది. అమెరికన్‍పౌరులను ఆదుకొనేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఈ రూ. కోటిన్నర కోట్లను వాడతామని వెల్లడించింది. ప్యాకేజీలో భాగంగా అమెరికాలోని ఒక్కో వ్యక్తికి రూ. 91 వేలు (1,200 డాలర్లు), పిల్లలకు 500 డాల‌‌‌‌ర్లు ఇవ్వనున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువవుతుండటంతో 60 రోజుల పాటు అమెరికా బలగాలు వేరే దేశాలకు వెళ్లకుండా ఆ దేశ డిఫెన్స్‌‌‌‌సెక్రటరీ మార్క్‌‌‌‌ఎస్పర్‌‌‌‌ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు నెలల్లో 90 వేల మందిని ఇతర దేశాలకు పంపాల్సి ఉంది. అయితే తాజా ఆదేశాలతో ఇదంతా ఆగిపోనుంది. అమెరికాలో 435 మంది ఆర్మీ సిబ్బందికి కరోనా సోకినట్టు వెల్లడించారు. కావాలని వ్యాధిని వ్యాప్తి చెందించే వాళ్లను  టెర్రరిస్టులుగా పరిగణించాలని అమెరికా  ప్రభుత్వానికి డిపార్ట్​మెంట్ ఆఫ్ జస్టిస్​ సూచించింది.

సోషల్‌‌‌‌డిస్టెన్సింగ్‌‌‌‌పనిజేస్తోంది: న్యూయార్క్‌‌‌‌

సోషల్‌‌‌‌డిస్టెన్సింగ్‌‌‌‌వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతున్నట్టు కనబడుతోందని న్యూయార్క్‌‌‌‌గవర్నర్‌‌‌‌అండ్రూ క్యుమో అన్నారు. ప్రస్తుతం తాము సరైన డైరెక్షన్‌‌‌‌లోనే వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నమోదైన సగానికన్నా ఎక్కువ కేసులు న్యూయార్క్‌‌‌‌సిటీలోనివేనన్నారు. డాక్టర్లందరికీ ప్రొటెక్టివ్‌‌‌‌పరికరాలిచ్చామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 2 కోట్ల జనాభా ఉంటోంది. ఇక ఏప్రిల్‌‌‌‌24 వరకు అత్యవసర పని మాత్రమే చేస్తామని వాషింగ్టన్‌‌‌‌డీసీ వెల్లడించింది. సిటీ జనమంతా ఇండ్లల్లోనే ఉండాలని కోరింది. ఇప్పటివరకు ఆ సిటీలో 185 మందికి కరోనా సోకింది. కరోనాపై పోరుకు ప్రపంచాన్ని ఏకం చేయాలని, ఇందుకు జీ20 సమ్మిట్‌‌‌‌ను వాడుకోవాలని ట్రంప్‌‌‌‌కు కొందరు అమెరికా నేతలు సూచించినట్లు తెలిసింది. వైరస్‌‌‌‌ప్రభావం నేపథ్యంలో ఈ సారి సదస్సు వర్చువల్‌‌‌‌గా జరగనుంది.

చైనాకు దగ్గర్లో యూఎస్‌‌‌‌ వార్‌‌‌‌షిప్‌‌‌‌

అమెరికా వార్‌‌‌‌షిప్‌‌‌‌ఒకటి చైనా దగ్గరున్న తైవాన్‌‌‌‌స్ట్రెయిట్‌‌‌‌ద్వారా ప్రయాణించింది. కరోనాపై రెండు దేశాలు ఒకరి మీద ఒకరు అగ్గిమీద గుగ్గిలమవుతున్న టైమ్‌‌‌‌లో వార్‌‌‌‌షిప్‌‌‌‌చైనాకు దగ్గరగా వెళ్లడంతో డ్రాగన్‌‌‌‌కంట్రీ చిటపటలాడింది. తైవాన్‌‌‌‌డిఫెన్స్‌‌‌‌మినిస్ట్రీ మాత్రం సాధారణ మిషన్‌‌‌‌లో భాగంగానే షిప్‌‌‌‌ముందుకెళ్లిందని వెల్లడించింది.

ఇంకో వారమైతే కష్టమే

హాస్పిటళ్లలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ.. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టేందుకు డాక్టర్లు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్లు పెడుతుంటరు. ఇలాంటి మెషీన్లకూ అమెరికాలో తీవ్ర కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఇల్లినాయీస్ రాష్ట్రంలో, అక్కడి పెద్ద సిటీ షికాగోలో వీటి కొరత ఎక్కువుంది. పేషెంట్లు పెరిగిపోతుండటం, సీరియస్ పరిస్థితిలోకి వెళ్తుండటంతో వెంటిలేటర్లు సరిపోతలేవని డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో వారంలో.. సీరియస్‌‌‌‌గా ఉన్నవాళ్లలో సగం మందికి వెంటిలేటర్లే దొరకవని అంటున్నారు.తమకు అందరు పేషెంట్లూ సమానమేనని, ఈ పరిస్థితిలో ఏ పేషెంట్‌‌‌‌ను ముందు కాపాడాలో తెలియడం లేదని, దీనిపై ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేయాలని డాక్టర్లు కోరుతున్నారు.

డబ్ల్యూహెచ్‌వోపై ట్రంప్‌ అసహనం
కరోనా వైరస్‌ విషయంలో చైనాను డబ్ల్యూహెచ్‌వో వెనకేసుకొస్తుండటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌వో తీరు సరికాదని విమర్శించారు. అమెరికా ప్రజల ఆరోగ్యానికి చైనా ముప్పై కూర్చుందని యూఎస్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌
మైక్‌ పొంపియో మండిపడ్డారు. కరోనా గురించి చైనా సమాచారం ఆలస్యంగా ఇవ్వడం వల్లే ఇతర దేశాలు అల్లాడే పరిస్థితి వచ్చిందని అన్నారు. కొవిడ్‌ 19 రెండో సైకిల్‌‌‌‌కు అమెరికా సిద్ధంగా ఉండాలని వైట్‌ హౌజ్‌ హెల్త్‌‌‌‌ అడ్వైజర్‌‌‌‌ ఆంటోని ఫాసి అన్నారు. ప్రస్తుతం శీతాకాలం మొదలవబోతున్న ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంతోపాటు, దక్షిణాది దేశాల్లో వైరస్‌ వ్యాప్తిని
గుర్తించామన్నారు. ఇతర ఫ్లూల్లాగే ఇది కూడా మళ్లీ ముంచుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అదే జరిగితే నష్టం ఎక్కువుంటుందని, వ్యాక్సిన్‌‌తో పాటు సమర్థవంతమైన చికిత్స విధానాలను కనుగొనాలని చెప్పారు.

For More News..

కరోనా కోసం ఆస్పత్రులుగా మారిన రైళ్లు

కరోనాకు ఆన్‌లైన్‌లో ట్రీట్‌మెంట్

అద్దె ఇంటి ఓనర్లకు సర్కారు వార్నింగ్

కరోనాకు విరుగుడు పేషంట్ల రక్తమే

Latest Updates