
బ్యాన్డ్ లిస్టులో క్యామ్ స్కానర్, వీచాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ యాప్స్
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చైనాకు చెందిన 8 పాపులర్ యాప్‌లను బ్యాన్ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇందులో చైనా బిలియనీర్ జాక్‌మాకు చెందిన అలీ పే, టెన్సెంట్ కంపెనీకి చెందిన వీచాట్ పే, క్యామ్‌స్కానర్, క్యూక్యూ వాలెట్, షేర్ఇట్, టెన్సెంట్క్యూక్యూ, వీమేట్, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ వంటి యాప్స్ ఉన్నాయి. ఈ నిర్ణయం మరో 45 రోజుల్లో అమల్లోకి రానుంది. అప్పటివరకు అధికార మార్పిడి పూర్తయి బైడెన్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఈ యాప్స్ అమెరికాలో కస్టమర్ల పర్సనల్ డేటాను చైనాకు చేరవేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఇప్పటికే ఇండియా దాదాపు 200 చైనీస్యాప్లను బ్యాన్ చేసిందని, అమెరికాలో ఎటువంటి నష్టం జరగక ముందే నిర్ణయం తీసుకుంటున్నామని ట్రంప్ చెప్పారు.