సైంటిస్టుల వార్నింగ్ : మరో 8 భూకంపాలు రాబోతున్నాయ్!

పోయిన శుక్రవారం 7.1 తీవ్రత. శనివారం నాడు 6.4 తీవ్రతతో రెండు వరుస భూకంపాలు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని గడగడలాడించాయి. ఈ రెండ్రోజుల్లోనే గుర్తు పట్టలేని స్థాయిలో 250 కంటే ఎక్కువ భూకంపాలు కాలిఫోర్నియా భూభాగాన్ని తాకాయి. ఈ ఆదివారం నుంచి శనివారం మధ్య దక్షిణ కాలిఫోర్నియాలో మరో 8 భూకంపాలు సంభవించే అవకాశం ఉందని అమెరికా జియాలాజికల్ సర్వే(యూఎస్ జీఎస్) అంచనా వేసింది. వీటి తీవ్రత 5 కంటే ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. దీని వల్ల బిల్డింగులు, ఇతర కట్టడాలు కొద్దిగా దెబ్బతినొచ్చని చెప్పింది.

అతి తక్కువగా 3 తీవ్రతతో భూకంపాలు రావొచ్చని యూఎస్ జీఎస్ వెల్లడించింది. శుక్ర, శనివారాల్లో వచ్చిన భూకంపాలు దక్షిణ కాలిఫోర్నియాలో విధ్వంసం సృష్టించాయి. చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల మంటలు ఎగసిపడ్డాయి. కాలిఫోర్నియా కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల ఇలా జరుగుతోందని భూకంపాల నిపుణులు చెబుతున్నారు. 7 అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే చాన్సులు ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే ఉన్నాయని యూఎస్ జీఎస్ తెలిపింది

Latest Updates