అమెరికా కొత్త ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లకు లైన్‌క్లియర్

బైడెన్, కమలకు కాంగ్రెస్ జై

అమెరికా కొత్త ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లుగా కన్ఫామ్ చేసిన ఉభయసభలు

వాషింగ్టన్: అమెరికా కొత్త ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లుగా జో బైడెన్, కమలా హారిస్ ల ఎన్నికను (అమెరికాకు పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ లాంటి) కాంగ్రెస్ సర్టిఫై చేసింది. వేలాదిమంది ట్రంప్ మద్దతుదారుల దాడి, విపరీతమైన టెన్షన్‌‌‌‌‌‌‌‌ మధ్య సమావేశమైన కాంగ్రెస్ ఉభయ సభలు (ప్రతినిధుల సభ, సెనేట్) ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల లెక్కింపును పూర్తి చేసి అధికారికంగా కొత్త ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లకు ఆమోద ముద్ర వేశాయి. దీంతో కొత్త ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లుగా డెమొక్రటిక్ నేతలు బైడెన్ (78), కమల (56).. జనవరి 20న ప్రమాణం చేసేందుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

రెండు అబ్జెక్షన్లూ రిజెక్ట్

వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ బిల్డింగ్ లో బుధవారం వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సమావేశం ప్రారంభమైన సమయంలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు దాడి చేయడంతో అక్కడంతా భయం భయంగా తయారైంది. దాడి చేసిన వాళ్లను కొన్ని గంటల తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాత్రి పొద్దుపోయాక కాంగ్రెస్ సమావేశం తిరిగి ప్రారంభమైంది. గురువారం తెల్లవారుజాము దాకా కొనసాగిన సమావేశంలో ఎలక్టోరల్ ఓట్ల లెక్కింపు నిర్వహించారు. చివరగా అరిజోనా, పెన్సిల్వేనియా స్టేట్స్ లో ఎన్నికల రిజల్ట్ పై వచ్చిన అబ్జెక్షన్లపై రెండు గంటల పాటు డిబేట్ జరిగింది. వీటిలో అరిజోనాపై అబ్జెక్షన్ ను సెనేట్ 93–6, ప్రతినిధుల సభ 303–121 ఓట్లతో తిరస్కరించాయి. విస్కాన్సిన్ పై అబ్జెక్షన్ ను సెనేట్ 92–7, ప్రతినిధుల సభ 282–138 ఓట్లతో రిజెక్ట్ చేశాయి. నలుగురు ఇండియన్ సభ్యులు రో ఖన్నా, అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ కూడా ఈ రెండు అబ్జెక్షన్లకు వ్యతిరేకంగా ఓటేశారు. రెండు అబ్జెక్షన్లూ రిజెక్ట్ కావడంతో.. సెనేట్ అధ్యక్షుడిగా మైక్ పెన్స్ విజేతలను అనౌన్స్ చేశారు. ‘‘బైడెన్, కమల అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ గా గెలిచినట్లు సెనేట్ సర్టిఫై చేసింది. వీరిద్దరి పదవీకాలం జనవరి 20, 2021న ప్రారంభమవుతుంది” అని ప్రకటించారు. అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికలు గతేడాది నవంబర్ 3న జరగగా, బైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లతో ఘనవిజయం సాధించడం, 232 ఓట్లే పొందిన ట్రంప్.. ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందంటూ కోర్టులకెక్కడం తెలిసిందే. చివరికి కాంగ్రెస్ సమావేశంలోనూ ఎన్నికల రిజల్ట్ ను తిరస్కరించాలంటూ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ను ట్రంప్ కోరగా.. ఆయన ఒప్పుకోలేదు. ‘‘వయెలెన్స్ ఎన్నటికీ గెలవదు. ఫ్రీడమే గెలుస్తుంది” అని స్పష్టం చేశారు.

ట్రంప్ ను తొలగించాలె: కాంగ్రెస్ సభ్యులు 

క్యాపిటల్ హిల్ బిల్డింగ్ పై దాడి నేపథ్యంలో ట్రంప్ ను ఇప్పుడే పదవి నుంచి తొలగించాలంటూ పలువురు చట్టసభ సభ్యులు డిమాండ్ చేశారు. అందరూ క్యాపిటల్ హిల్స్ కు రావాలని, రిజల్ట్ ను తిరస్కరించాలంటూ పెన్స్ ను డిమాండ్ చే యాలని ట్రంప్ పిలుపునివ్వడాన్ని వారు తప్పుపట్టారు.

ట్రంప్‌‌పై మాజీ ప్రెసిడెంట్లు ఫైర్

ట్రంప్ సపోర్టర్ల అల్లర్లను మాజీ ప్రెసిడెంట్లు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్ తీవ్రంగా ఖండించారు. అధికార మార్పిడి ప్రశాంతంగా జరగాల్సిన అవసరం ఉందని ప్రకటనలు విడుదల చేశారు. ‘‘చట్టబద్ధంగా జరిగిన ఎన్నికలపై అబద్ధాలు ప్రచారం చేస్తూ.. ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ అల్లర్లను రెచ్చగొట్టడాన్ని మన దేశానికి జరిగిన ఘోర అవమానంగా చరిత్ర గుర్తుంచుకుంటుంది” అని ఒబామా అన్నారు. ఈ అల్లర్లను ఇంకా రెచ్చగొట్టాలా? వాస్తవాన్ని అనుసరించి అమెరికాను ఎంపిక చేసుకోవాలా? అన్నది రిపబ్లికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ‘‘జార్జియా వంటి రాష్ట్రాల అధికారులు తమ డ్యూటీలను గౌరవంగా చేశారు. ఇప్పుడు అమెరికన్లు అంతా పార్టీలకు అతీతంగా స్పందించాలి. బైడెన్ ను సపోర్ట్ చేయాలి” అని జార్జ్ బుష్​కోరారు. ‘‘మనదేశం, రాజ్యాంగంపై జరిగిన దాడి ఇది. నాలుగేళ్ల పాయిజన్ పాలిటిక్సే ఇందుకు దారి తీశాయి. మనం హింసను తిరస్కరించాలి” అని క్లింటన్ అన్నారు.

For More News..

సోయా సీడ్స్​ ఇవ్వలేం.. చేతులెత్తేసిన సీడ్ కార్పొరేషన్

అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వలేం.. తొలి తీర్పు చెప్పిన చీఫ్ జస్టిస్

పుణె నుంచి దేశమంతా వ్యాక్సిన్ల పంపిణీ

Latest Updates