మేక్ ఇన్ ఇండియా: చైనా నుంచి తరలి రానున్నఅమెరికా కంపెనీలు

వందలాది విదేశీ కంపెనీలు చలో ఇండియా అంటున్నాయి. చైనాలో ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీలన్నీ ఇప్పుడు మనదేశం వైపు దృష్టిపెట్టాయి. చైనాకంటే ఇండియానే బిజినెస్ కు బెస్ట్ చాయిస్ అని భావిస్తున్న200 కంపెనీలు లోక్ సభ ఎన్నికలు పూర్తవగానే ఇండియా రానున్నాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. ఇండియాలో పెట్టుబడులు ఎలాపెట్టాలని చాలా కంపెనీల ప్రతినిధులు తమను అడుగుతున్నారని అమెరికా-ఇండియా స్ట్రాటజిక్‌‌‌‌ అండ్‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ఫోరమ్‌ చీఫ్ ముఖేశ్‌ అగి చెప్పారు.

 

పొరుగుదేశం చైనాలో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న వందలాది అమెరికా, ఇతర దేశాలకంపెనీలు ఇండియా దారి పడుతున్నాయి. ప్రస్తుతంజరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే, దాదాపు 200 కంపెనీలు మనదేశానికి రానున్నాయని అమెరికాకు చెందిన ఒక వాణిజ్య సంస్థ తెలిపింది. చైనాకు ప్రత్యామ్నాయం ఇండియాయేనని, ఇక్కడ అద్భుత అవకాశాలు ఉన్నాయని చైనాలోని ఇతరదేశాల కంపెనీలు భావిస్తున్నాయి. ఈ విషయమై అమెరికా–ఇండియా స్ట్రాటెజిక్‌ అండ్‌ పార్ట్‌ నర్‌‌షిప్‌ఫోరమ్‌ (యూఎస్‌ ఐఎస్‌ పీఎఫ్‌ ) అధ్యక్షుడు ముకేశ్‌అగి మాట్లాడుతూ చైనా నుంచి వచ్చి ఇండియాలో పెట్టుబడులు ఎలా పెట్టాలని కంపెనీల ప్రతినిధులు అడుగుతున్నారని వెల్లడించారు.

కొత్త కంపెనీలను ఆకర్షించడానికి త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయాలని, నిర్ణయాలు తీసుకునేటప్పుడు పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ‘‘ప్రభుత్వ నిర్ణయాలు కీలకం. పాలన మరింత పారదర్శకంగా ఉండాలని, సంప్రదింపులకు అవకాశం ఇవ్వాలని మేం సూచిస్తాం.ఈ కామర్స్‌ , డేటా లోకలైజేషన్‌ వంటి పరిణామాలను అమెరికా కంపెనీలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. అలాగే మనదేశంలో కంపెనీలు నెలకొల్పడం ద్వారా దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జా తీయ మార్కెట్లలోనూ రాణించాలనే యోచనలో అమెరికన్‌ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది’’ అని చెప్పా రు.

సంస్కరణలు తప్పనిసరి..
మరిన్ని ఇన్వెస్ట్‌ మెంట్లను ఆకర్షించడానికి కొత్త ప్రభుత్వం ఏం చేయాలన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ మరిన్ని సంస్కరణలు తేవాలని, పాలన మరింత పారదర్శకంగా ఉండాలని జవాబిచ్చారు. ‘‘కంపెనీలను ఎలా ఆకర్షించ వచ్చనేది ముందు మనం తెలుసుకోవాలి. భూసేకరణ, పన్నుల చెల్లింపు వంటి క్లిష్టసమస్యలను త్వరగా పరిష్కరించాలి. సంస్కరణల వేగం పెంచితే మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు’’ అని అగి చెప్పారు. యూఎస్‌ ఐఎస్పీఎఫ్‌ తో కలిసి పనిచేస్తున్న అమెరికా మాజీ వాణిజ్య ప్రతినిధి మార్క్‌‌ లిన్‌ స్కాట్‌ .. ఇండియా ఎగుమతులు పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సిఫార్సులు చేస్తారని తెలిపారు. అమెరికా ఇండియా మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌ టీఏ) ఒప్పం దంగురించి అందరం ఆలోచించాలని అన్నారు. చైనా నుంచి చవగ్గా వస్తున్న వస్తువుల బెడదను తొలగించు కోవాలంటే ఎఫ్‌ టీఏ అవసరమని చెప్పారు. దీనివల్ల చైనా వస్తువులకు అడ్డుకట్ట వేయవచ్చని,ఇండియా అమెరికా మార్కెట్లలో అవకాశాలను, అమెరికా ఇండియా మార్కెట్లను ఉపయోగించు కోచ్చని తెలిపారు.

ఇండియాను మాన్యుఫ్యా క్చరింగ్‌హబ్‌ గా మార్చడానికి ఏం చేయాలో తెలియజేయడానికి సభ్య కంపెనీలతో అత్యున్నత స్థాయి మండలిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. సిస్కో సప్లై చైనా ఆపరేషన్స్‌ సీనియర్‌‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ కెర్న్‌‌ దీనికి నాయకత్వం వహిస్తారు. ఇండియాకు అందజేయడానికి అవసరమైన పత్రాలను కూడా ఆయన తయారుచేస్తున్నారు. ‘‘తాము ఇండియాలో మాన్యుఫ్యా క్చరింగ్‌ మొదలు పెట్టాలంటే మన ప్రభుత్వానికి తగిన వ్యూహం ఉండాలని అవి (కంపెనీలు) అభిప్రాయపడుతున్నాయి. ఈ చాలా కంపెనీలు ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. వందలాది కంపెనీలు తమ వస్తువుల తయారీని ఇక్కడే మొదలు పెట్టడమేకాదు మనదేశ మార్కెట్లనూ ఉపయోగించు కోవడానికి కూడా సిద్ధమవుతున్నాయి’’ అని వివరించారు. గత నాలుగు సంవత్సరంలో అమెరికా కంపెనీలు 50బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.49 లక్షల కోట్లు)పెట్టుబడులు పెట్టాయని ముఖేశ్‌ అగి వివరించారు.

Latest Updates