ఆ మూడు ఈవెంట్లే అమెరికా కొంపముంచాయి

న్యూయార్క్: ప్రస్తుతం  అమెరికాలో అన్ని రాష్ట్రా ల కన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయింది న్యూయార్కే. అక్కడే దాదాపు 2 లక్షలదాకా కేసులు నమోదయ్యాయి .దానికి కారణం యూరప్ దేశాలేనని మౌంట్ సియాన్ లోని  ఇకన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్ట్ ల స్టడీలో తేలింది. పేషెంట్లకు సోకిన కరోనా డీఎన్ఏ నమూనాలను పరిశీ లించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఏడు వైరస్ స్ట్రెయిన్లను గుర్తించారు. ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంటున్నా రు. గవర్నమెంట్ ఆలస్యంగా స్పందించడం, లాక్ డౌన్ ప్రకటించకపోవడం, విదేశాల నుంచి వచ్చినోళ్ల  చైనా ట్రావెల్ హిస్టరీని మాత్రమే చూడడం వంటివి ప్రస్తుత పరిస్థితులకు కారణమని విశ్లేషించారు.  ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ చేసేటప్పుడు ట్రావెల్ హిస్టరీని చెక్ చేసి ఉంటే బాగుండేదని చెబుతున్నా రు. వాషింగ్ టన్ లో రియాక్టడ్ కేసులకు మూలం మాత్రం చైనానేనని నిర్ధారించారు. మొత్తంగా ఎక్కువ కేసులకు యూరప్ తోనే  లింకుందని తేల్చారు. దేశంలో పరిస్థితి విషమించడానికి ముందే లక్షలాది మంది యూరప్, చైనాల నుంచి అమెరికాలోకి ఎంటరయ్యారని కామర్స్ డిపార్ట్ మెంట్  లెక్కలు చెబుతున్నాయి. దాదాపు34 లక్షల మంది ట్రావెల్ హిస్టరీని  పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు.

 మేం రాం.. ఇక్కడే సేఫ్

కరోనా ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న వివిధ దేశాల ప్రజలు.. ‘మమ్మల్ని తీసుకెళ్లండి మహా ప్రభో’ అని మొరపెట్టుకుంటుంటే, లెబనాన్లో చిక్కుకున్న అమె రికన్లు మాత్రం ‘మేం రాం’ అని తేల్చి చెప్పేస్తున్నారు. ముందుగా వెళ్దామని డిసైడ్ అయినా, దేశంలోని ప్రస్తు పరిస్థితుల నేపథ్యంలో అక్కడికెళ్తే డేంజర్ అన్న భావనలో ఉన్నారు. దేశంలో గురువారం 70 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయామంటూ  అప్లికేషన్లు పెట్టుకున్నారు. కరోనాను అంతం చేసే 10 మందులపై ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నట్టు ప్రెసిడెంట్  డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.  ఫార్మా కంపెనీలు, డాక్టర్లు, సైంటిస్టులు ఆ పనిలోనే ఉన్నారని ఆయన అన్నారు.

ఆ మూడే కొంప ముంచినయ్

ఒక్క మర్కజ్ ఈవెంట్.. మన దేశంలో కరోనా కేసులు పెరగడానికి కారణమైంది. అమెరికానూ అలాంటి ఈవెంట్లే ముంచే శాయి. ఓ బర్త్ డే  పార్టీ, పార్టీ ఓ అంతిమసంస్కారం, ఓ చావు,ఓ చర్చి మీటింగ్ .. కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి కారణమయ్యాయి. ఇంకో విషయమేంటంటే ఆ మూడు కార్యక్రమాలూ ఒక దానికొకటిలింకయ్యాయి .

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్  ఆ వివరాలు వెల్లడించింది. ఫిబ్రవరిలో షికాగో కు చెందిన ఓ వ్యక్తి బర్త్ డే  పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీ ఇచ్చిన వ్యక్తికి అప్పటికే కరోనా సోకింది. కానీ, ఆ విషయం అతడికి తెలియక దగ్గరి చుట్టాలను పిలుచుకుని పార్టీ చేసు కున్నాడు. అతడి నుంచి ఓ 15 మందికి వైరస్ పాస్ అయింది. అందులో ముగ్గురు చనిపోయారు . దీంతో ఆ 15 మంది నుంచి మరింత మందికి వైరస్ సోకింది. అదే షికాగో లో చనిపోయిన ఓ వ్యక్తి ఇంట్లో అంత్య క్రియలకు సంబంధించిన కార్యక్రమం జరిగింది.ఆ కార్యక్రమంలో ‘ఇండెక్స్ పేషెంట్’ గా పిలుస్తున్న ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులు, తన స్నేహితులు, బంధువులకు బయటి నుంచి తెప్పించిన ఫుడ్తో డిన్నర్ ఇచ్చాడు. ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్లలో ముగ్గురికి జస్ట్ ఆరు రోజుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. అందులో ఓ వ్యక్తి చనిపోయాడు. అంత్య క్రియలు ముగిసిన మూడు రోజులకు ఆ ఇండెక్స్ పేషెంట్, షికాగో వ్యక్తి ఇచ్చిన బర్త్ డే పార్టీకి వెళ్లాడు. అక్కడ ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల తో దాదాపు 3 గంటలు గడిపాడు. దీంతో అతడు కలిసిన వాళ్లందరికీ వైరస్ వచ్చింది. అందులో ఇద్దరు చనిపోయారు. వైరస్ సోకిన వాళ్లల్లో ముగ్గురు బర్త్డే పార్టీ అయిన ఆరు రోజులకు ఓ చర్చికి వెళ్లారు. అక్కడ ఓ హెల్త్ వర్కర్ కు వైరస్ అంటించారు. మరి కొంత మందికీ వైరస్ పాకింది. అలా అలా ఒకరి నుంచి ఒకరికి వైరస్ పాకుతూ వెళ్లింది. ఎవరు అంటించారో తెలియకుండానే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలైంది. వైరస్ సోకిన వాళ్లందరి వయసు 5 నుంచి 86 ఏళ్ల వరకు ఉంటుందని సీడీసీ ప్రకటించింది. ఇదంతా లాక్డౌన్ అమలు చేయకముందు జరిగిందని తెలిపింది.

Latest Updates