కరోనా కట్టడికి 3 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన అమెరికా

గతంలో 2.9 మిలియన్ డాలర్ల సాయం
మొత్తంగా 5.9 మిలియన్ డాలర్ల సాయం
రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని తెలిపేందుకేనన్న యూఎస్ రాయబార కార్యాలయం

భారత్ లో కరోనావైరస్ కట్టడి కోసం అమెరికా మరోసారి ఆర్థికసాయాన్ని ప్రకటించింది. కరోనా నియంత్రణకోసం 3 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో రూ. 22 కోట్ల 53 లక్షల 30 వేలు)ను ప్రకటిస్తున్నట్లు అమెరికా ఆర్థిక సంస్థ యూఎస్ఎఐడీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. ఆ వైరస్ ఇండియాలో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దాని ప్రభావాన్ని ముందుగానే అంచనావేసిన భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. దాంతో భారత్ లో కరోనా ప్రభావాన్ని దాదాపు తగ్గిందనే చెప్పొచ్చు.

భారత్ కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి USAID (US Agency for International Development) ద్వారా మరో 3 మిలియన్ డాలర్లు మంజూరు చేసినట్లు అమెరికన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి గతంలోనే ఏప్రిల్ 6న ఇండియాకు 2.9 మిలియన్ డాలర్లు USAID మంజూరు చేసింది.

కరోనా పై ఇండియా చేస్తున్న పోరాటానికి ఈ అదనపు నిధులు మరింత తోడ్పడతాయని భారత్ లోని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ అన్నారు. ‘కరోనాను ఎదుర్కోవటానికి ఇండియా చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు అమెరికా మద్దతు ఇస్తుంది. అందుకే ఈ అదనపు నిధులు విడుదల చేశాం. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇండియా మధ్య బలమైన బంధానికి ఈ నిధుల విడుదల ఒక ఉదాహరణ’ అని యూస్ రాయబార కార్యాలయం పేర్కొంది.

యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సహాయ సంస్థలలో ఒకటి. PAHAL (Partnerships for Affordable Healthcare Access and Longevity) ద్వారా USAID ఈ నిధులను అందిస్తోంది. ఈ రోజు వరకు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు USAID భారతదేశానికి 5.9 మిలియన్ డాలర్లు సహాయంగా ఇచ్చింది. ఈ సహాయం ఇండియాలో కరోనా వ్యాప్తి తగ్గడానికి, బాధితులకు రక్షణ కల్పించడానికి, అవసరమైన ప్రజారోగ్య సందేశాలను ప్రజలకు చేరవేయడానికి, కరోనా కేసులను పట్టుకోవడానికి, మరియు లాక్డౌన్ నిఘాను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

For More News..

చికెన్ రేటు ఎక్కువ చెప్పాడని.. పొడిచి చంపిన అన్నదమ్ములు

పోలీసులు లాక్డౌన్ డ్యూటీలో.. దొంగలు తమ పనిలో..

మందుకోసం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని 19 ఏళ్ల కొడుకుని..

బస్సును మొబైల్ ఫీవర్ క్లినిక్‌గా మార్చిన ఆర్టీసీ

Latest Updates