మామ పైకి మనిషి

america-land-a-man-over-the-moon-six-times

చంద్రునిపైకి ల్యాండర్లను పంపడం, రోవర్లను దింపడం ఒకెత్తయితే మనుషులను పంపడం, వాళ్లను సేఫ్‌‌గా భూమిపైకి తీసుకురావడం మరో ఎత్తు. ఇందులో అమెరికా ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది. వరుసగా ఆరు సార్లు మనుషులను మామపైకి పంపింది.

1969 జులై 20

అపోలో 11 అంతరిక్ష నౌకలో నీల్‌‌‌‌ ఆర్మ్‌‌‌‌ స్ట్రాంగ్‌‌‌‌, బజ్‌‌‌‌ అల్డ్రిన్‌‌‌‌, మైకెల్‌‌‌‌ కొల్లిన్స్‌‌‌‌లను అమెరికా చంద్రునిపైకి పంపింది. చంద్రునిపై నడిచిన తొలి వ్యక్తిగా స్ట్రాంగ్‌‌‌‌ రికార్డు సృష్టించారు. స్ట్రాంగ్‌‌‌‌ నడిచిన 19 నిమిషాలకు బజ్‌‌‌‌ కూడా మామపై నడి చారు. ఇద్దరూ 21 గంటలు గడిపారు. మైకెల్‌‌‌‌ మాత్రం కమాం డర్‌‌‌‌ మాడ్యూల్‌‌‌‌లోనే ఉన్నారు. అందరూ జులై 24న భూమిపైకి వచ్చేశారు. ఫసిఫిక్‌‌‌‌ మహాసముద్రంలో ల్యాండ్‌‌‌‌ అయ్యారు.

1969 నవంబర్‌‌ 19

అపోలో 11ను పంపిన 4 నెలలకే అపోలో 12ను అమెరికా మూన్‌‌పైకి పంపింది. ముగ్గురు ఆస్ట్రొనాట్లు చార్లెస్‌‌ పీట్‌‌, అలెన్‌‌  బీన్‌‌, రిచర్డ్‌‌ గోర్డాన్‌‌ మామపైకి వెళ్లారు. పీట్‌‌, అలెన్‌‌ మూన్‌‌వాక్‌‌ చేశారు. 30 గంటల పాటు అక్కడే ఉన్నారు. తొలిసారి ఓ కలర్‌‌ టెలివిజన్‌‌ కెమెరాను మూన్‌‌పైకి తీసుకెళ్లారు. కానీ సూర్యకాంతికి అది పాడైపోయింది. రిచర్డ్‌‌ ల్యూనార్‌‌ ఆర్బిటర్‌‌లోనే ఉన్నారు. నవంబర్‌‌ 24న వెనక్కి వచ్చేశారు.

1971 ఫిబ్రవరి 5

అపోలో 14లో అలెన్‌‌ షెపర్డ్‌‌, ఎడ్జర్‌‌ మిచెల్‌‌, స్టువర్ట్‌‌ రూసా చంద్రునిపైకి వెళ్లారు. లూనార్‌‌ హైలాండ్స్‌‌లో షెపర్డ్‌‌, మిచెల్‌‌ దిగారు. చంద్రునిపై రాళ్ల శాంపుల్స్‌‌ తీసుకున్నారు. అక్కడే కొన్ని ప్రయోగాలు చేశారు. సుమారు 33 గంటలు గడిపారు. ఫిబ్రవరి 9న ఫసిఫిక్‌‌ మహాసముద్రంలో దిగారు.

1971 జులై 30

అపోలో 15లో డేవిడ్‌‌‌‌ స్కాట్‌‌‌‌, జిమ్‌‌‌‌ ఇర్విన్‌‌‌‌, అల్ఫ్రెడ్‌‌‌‌ వార్డెన్‌‌‌‌ మామపైకి వెళ్లారు. స్కాట్‌‌‌‌, జిమ్‌‌‌‌ మూన్‌‌‌‌పై దిగారు. వీళ్లు తొలిసారి చంద్రునిపై లూనార్‌‌‌‌ రోవింగ్‌‌‌‌ వెహికిల్‌‌‌‌ను వాడారు. శాంపుల్స్‌‌‌‌ను తీసుకున్నారు. సుమారు 18 గంటలు మామపై గడిపారు. ఆగస్టు 7న భూమిపై దిగారు.

1972 ఏప్రిల్‌‌ 21

నాసా అపోలో ప్రోగ్రామ్‌‌లో ఐదో మిషన్‌‌ అపోలో 16. చార్లెస్‌‌ డ్యూక్‌‌, జాన్‌‌ యంగ్‌‌, కెన్‌‌ మాటింగ్లీ చంద్రుని పైకి వెళ్లారు. యంగ్‌‌, డ్యూక్‌‌ చంద్రునిపై దిగి లూనార్‌‌ రోవింగ్‌‌ వెహికిల్‌‌ను 26 కిలోమీటర్లు నడిపారు. ఇద్దరూ కలిసి 95 కిలోల లూనార్‌‌ శాంపుల్స్‌‌ సేకరించారు. ఏప్రిల్‌‌ 27న భూమిపైకి వచ్చేశారు.

1972 డిసెంబర్‌‌ 11

నాసా అపోలో ప్రోగ్రామ్‌‌లో చివరి మిషన్‌‌ అపోలో 17. ఈజీన్‌‌ సెర్నన్, హారిసన్‌‌ స్చిమిట్, రొనాల్డ్‌‌ ఇవాన్స్‌‌ చంద్రునిపైకి వెళ్లారు. సెర్నర్‌‌, హారిసన్‌‌ మాన్‌‌ వాక్‌‌ చేశారు. లూనార్‌‌ రోవింగ్‌‌ వెహికిల్‌‌ను నడిపారు. శాంపుల్స్‌‌ తీసుకున్నారు. సైంటిఫిక్‌‌ పరికరాలు మూన్‌‌పై అమర్చారు. డిసెంబర్‌‌ 19న తిరిగి భూమిపైకి వచ్చేశారు.

మెల్లమెల్లగా

మనకు అల్లంత దూరంలో ఉన్న చందమామ గురించి తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయోగాలు ఇప్పటివి కావు. 1950ల నుంచే మొదలయ్యాయి. మామ దగ్గరి వరకు వెళ్లడం మొదలు చంద్రుని చుట్టూ ఆర్బిటర్లను తిప్పడం, ఇంపాక్టర్లను దింపడం, సాఫ్ట్‌‌ ల్యాండింగ్‌‌, మనుషులు మామపై అడుగుపెట్టడం వరకు మెల్లమెల్లగా జరుగుతూ వచ్చాయి. చంద్రున్ని తొలిసారి టచ్‌‌ చేసిన ఘనత యూఎస్‌‌ఎస్‌‌ఆర్‌‌కు దక్కితే మనుషులను పంపిన రికార్డు అమెరికాది.

1959 జనవరి 2

యూఎస్‌‌ఎస్‌‌ఆర్‌‌ చంద్రునిపైకి తొలిసారి లూనా 1 రాకెట్‌‌ను పంపింది. కానీ మిషన్‌‌ సగమే సక్సెస్‌‌ అయింది. మూన్‌‌ దగ్గరకు వెళ్తున్న క్రమంలో బూస్టర్లను టైంకు మండించక పోవడంతో కక్ష్యలోకి చేరలేదు.

1959 సెప్టెంబర్‌‌ 12

చంద్రున్ని తొలిసారి టచ్‌‌ చేసిన ఘనత యూఎస్‌‌ ఎస్‌‌ఆర్‌‌ది. 1959 సెప్టెంబర్‌‌ 13న ప్రపంచ చరిత్రలో ఫస్ట్‌‌ టైం సోవియట్‌‌ యూనియన్‌‌ తన లూనా 2 ప్రయోగం ద్వారా చంద్రుడిని ఇంపాక్టర్‌‌తో ఢీకొట్టింది.

1959 అక్టోబర్‌‌ 4

యూఎస్‌‌ఎస్‌‌ఆర్‌‌ లూనా 3ని పంపింది. ఇదీ సక్సెస్‌‌ అయింది. చంద్రుని ఫార్‌‌ సైడ్‌‌ను (భూమికి కనిపించని వైపు) తొలిసారి ఫొటోలు తీసింది. లూనా ౩నే.

1964 జులై 28

అమెరికా రంగంలోకి దిగింది. రేంజర్‌‌ 7ను మామపైకి పంపింది. చంద్రుని ఫొటోలు తీసి పంపిన ఆ దేశ తొలి స్పేస్‌‌ ప్రోబ్‌‌ రేంజర్‌‌ 7.

1966 జనవరి 31

యూఎస్‌‌ఎస్‌‌ఆర్‌‌ లూనా 9ను మామ పైకి పంపింది. సాఫ్ట్‌‌ ల్యాండింగ్‌‌ చేసి రికార్డు సృష్టిం చింది. పూర్తి నియంత్రణలో ల్యాండర్‌‌/రోవర్‌‌ను దింపింది.

1966 ఏప్రిల్‌‌ 3

లూనా 10తో ఆర్బిటర్‌‌ను పంపింది. ప్రయోగం సక్సెస్‌‌ అయింది.

1968 సెప్టెంబర్‌‌‌‌ 15

యూఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ జోండ్‌‌‌‌ 5ను మామపైకి పంపింది. పంపడమే కాదు స్పేస్‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌ను మళ్లీ సేఫ్‌‌‌‌గా భూమిపై దింపింది. పైగా తాబేళ్లు, ఫ్రూట్‌‌‌‌ ఫ్లై గుడ్లు, కొన్ని మొక్కలను జోండ్‌‌‌‌లో పంపారు. తిండి లేక, స్పేస్‌‌‌‌లో ప్రయాణం వల్ల తాబేళ్లు నీరసించినా వాటికేం కాలేదు.

1969 జులై 20

అమెరికా అపోలో 11ను చంద్రునిపైకి పంపింది. ఈ నౌకలోనే నీల్‌‌‌‌ ఆర్మ్‌‌‌‌స్ట్రాంగ్‌‌‌‌ ఉన్నారు.

1972 డిసెంబర్‌‌‌‌ 7న

అపోలో 17 నౌకలో ముగ్గురు ఆస్ట్రొనాట్లు చంద్రునిపైకి వెళ్లారు. వీళ్లలో మూన్‌‌‌‌పైకి వెళ్లిన తొలి సైంటిస్టు హర్రిసన్‌‌‌‌. మామపై వీళ్లు నడిచి, శాంపిళ్లు సేకరించి క్షేమంగా భూమిపై దిగారు.

1990 జనవరి 24న

జపాన్‌‌‌‌ తెరపైకి వచ్చింది. హితేన్‌‌‌‌తో తొలిసారి ఆర్బిటర్‌‌ను కక్ష్యలో పంపి సక్సెస్‌‌‌‌ అయింది.

2003 సెప్టెంబర్‌‌‌‌ 27

యూరోపియన్‌‌‌‌ యూనియన్‌‌‌‌ కూడా స్మార్ట్‌‌‌‌ 1 మిషన్‌‌‌‌ను విజయవంతంగా చేపట్టింది. ఇది కూడా లూనార్‌‌‌‌ ఆర్బిటర్‌‌‌‌.

2008 అక్టోబర్‌‌‌‌ 22

ఇండియా చంద్రయాన్‌‌‌‌ 1 ప్రయోగం చేసింది. ఆర్బిటర్‌‌‌‌, ఇంపాక్టర్‌‌‌‌ను మూన్‌‌‌‌పైకి పంపింది. మామపై నీళ్లున్నాయని తొలిసారి గుర్తించింది.

2018 డిసెంబర్‌‌‌‌ 7

చైనా చాంగీ 4ను చంద్రునిపైకి పంపింది. మనకు కనిపించని చంద్రుని భాగంలో (ఫార్‌‌‌‌ సైడ్‌‌‌‌) రోవర్‌‌‌‌ను దింపి రికార్డు సృష్టించింది.

 

America land a man over the moon six times .

Latest Updates