బైడెన్‌ ఫాలో అయ్యే ఒకే ఒక్క సెలబ్రిటీ.. ఎవరు, ఎందుకో తెలుసా?

అమెరికా ప్రెసిడెంట్​గా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్‌‌, ప్రెసిడెంట్​ ట్విట్టర్‌‌‌‌ ఖాతా (@POTUS)ను కూడా హ్యాండిల్‌‌ చేస్తున్నాడు. ఇప్పటివరకు ట్రంప్‌‌ ఈ అకౌంట్‌‌ మెయిన్‌‌టెయిన్‌‌ చేయగా, ఇప్పుడు బైడెన్‌‌ చేతిలోకి ఈ అకౌంట్‌‌ వెళ్లింది. ప్రెసిడెంట్‌‌గా ప్రమాణ స్వీకారం చేశాక, బైడెన్‌‌ పన్నెండు అకౌంట్లను మాత్రమే ట్విట్టర్‌‌‌‌లో ఫాలో అవుతున్నారు. ఈ అకౌంట్స్‌‌లో అమెరికన్‌‌ ఫస్ట్‌‌ లేడీ, బైడెన్‌‌ భార్య అయిన జిల్‌‌ బైడెన్‌‌, వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ కమలా హ్యారిస్‌‌, ఆమె భర్తతోపాటు వైట్‌‌ హౌజ్‌‌ అకౌంట్‌‌, ఉన్నతస్థాయి వైట్‌‌హౌజ్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. వీళ్లంతా బైడెన్‌‌తోపాటు, వైట్‌‌హౌజ్‌‌లో వివిధ అధికారిక హోదా కలిగిన వాళ్లే. అయితే, వీళ్లు కాకుండా, ఆయన క్రిస్సీ టైజెన్‌‌ అనే ఒకే ఒక సెలబ్రిటీని ఫాలో అవుతున్నారు. ఆమె మోడల్‌‌గా, టీవీ ఆర్టిస్ట్‌‌గా, ఎంట్రప్రెన్యూర్‌‌‌‌గా గుర్తింపు తెచ్చుకుంది. ట్విట్టర్‌‌‌‌లో ఆమె ఎప్పుడూ యాక్టివ్‌‌గా ఉంటారు. ప్రజా సమస్యలపై రియాక్ట్​ అవుతుంటారు. ఇంతకుముందు ట్రంప్‌‌ పాలనకు వ్యతిరేకంగా అనేక ట్వీట్స్‌‌ చేశారు. దీంతో గతంలో ఆమె అకౌంట్‌‌ను  ట్రంప్‌‌ బ్లాక్‌‌ చేశారు. బుధవారం ఉదయం జో బైడెన్‌‌ ప్రమాణ స్వీకారానికి ముందు ఆయనకు క్రిస్సీ ఒక ట్వీట్‌‌ చేసింది. నాలుగేళ్లుగా ట్రంప్‌‌ తన ట్విట్టర్‌‌‌‌ను బ్లాక్‌‌ చేశారని, మీరైనా అన్‌‌బ్లాక్‌‌ చేసి తిరిగి ఫాలో అవుతారా అంటూ కోరారు. సాయంత్రానికల్లా ఆమెను బైడెన్‌‌ ఫాలో అవ్వడం మొదలుపెట్టడం విశేషం. జో బైడెన్‌‌, తన పర్సనల్‌‌ అకౌంట్‌‌లో మాత్రం చాలామంది సెలబ్రిటీలను ఫాలో అవుతున్నారు.

For More News..

బీఎండబ్ల్యూ నుంచి మరో కొత్త కారు

ప్రతీ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాన్నకే అంకితం.. ఇంత గొప్ప పెర్ ఫామెన్స్‌ ఊహించలేదు

కరోనా తర్వాత పెద్ద ఫ్లాట్లను కోరుకుంటున్న జనాలు

Latest Updates