భారత్ లో మరో ఉగ్రదాడి జరిగితే.. సహించేది లేదు: అమెరికా

భారత్ పై మరో ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అమెరికా తెలిపింది. పాకిస్తాన్ లో జైషే మహమ్మద్, లష్కరే లాంటి ఉగ్ర సంస్థలు విచ్చలవిడిగా తమ కార్య కలాపాలను నిర్వహిస్తున్నాయని తెలిపింది. ఈ ఉగ్ర సంస్థలే భారత్ లో ఉగ్రదాడులు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పింది. ఇప్పటికైనా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర సంస్థలపై ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హితవుపలికింది.

జైషే మహమ్మద్ లాంటి పలు ఉగ్ర సంస్థలు పాక్ లో భహిరంగంగా సభలు నిర్వహించి ఆ దేశ యువతను పెడతోవ పట్టిస్తున్నాయని వైట్ హౌస్ అధికారులు చెప్పారు. అవి దేశానికి మంచిది కాదని అన్నారు. ఇప్పటికైతే భారత్… పాక్ ల మధ్య పరిస్థితులు మామూలుగా ఉన్నప్పటికీ.. సరిహద్దుల్లో మాత్రం సైన్యం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో పాక్ విపలం అవుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇదే గనుక కొనసాగితే ప్రపంచంలో పాక్ ఏకాకి అవడం ఖాయమని అమెరికా అధికారులు చెప్పారు.

 

Latest Updates